ఆదిలాబాద్: పెళ్లికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కాశీ పేట మండలం ధర్మారావుపేట గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఒక పెళ్లికి సంతోష్(8), విజయ్(8) వెళ్లారు.
అలా వెళ్లిన పిల్లలు తెల్లవారినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. అయినా వారి ఆచూకి తెలియకపోవడంతో పోలీసులను సంప్రదించారు. కేసు నమోదు చేసుకొని పిల్లల ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(కాశీపేట)