వరంగల్: వరంగల్ జిల్లా మామునూరు మండలం గుంటూరుపల్లెలో చెట్టుకు ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు...గుంటూరుపల్లెలో ముగ్గురు యువకులు బైక్‌పై వెళుతున్నారు. మార్గ మధ్యంలో ఓ చెట్టుకు బైక్ ఢీకొట్టడంతో బైక్‌పైన ఉన్న మాగాటి మహేందర్, కలగాటి దయాకర్ అక్కడిక్కడే మృతి చెందారు. మాగాటి సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మామునూరు)