నల్గొండ : నల్గొండ జిల్లాలోని రామన్నపేట మండలంలో గురువారం వడదెబ్బకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మంటి యాదయ్య(50) బుధవారం వడదెబ్బకు గురయ్యాడు. కాగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. అదేవిధంగా జనంపల్లి గ్రామానికి చెందిన కుకుడాల లక్ష్మమ్మ(55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఎండతీవ్రతను తట్టుకోలేక గురువారం మృతిచెందింది.