సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ ఏడాది తొలి రెండువారాల్లో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా తాజాగా గురు, శుక్రవారాల్లో మరో ఇద్దరు బలయ్యారు. మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన 60 ఏళ్ల మహిళ గురువారం, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డారు.
గ్రేటర్‌లో రెండు రోజుల్లో 35 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికులు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందినవారే. గురువారం 24, శుక్రవారం 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 16 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో 11మంది కేర్, అపోలో, యశోద, శ్రీరాం మల్టీస్పెషాలిటీ, కిమ్స్, హోలిస్టిక్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి(38) ఉన్నట్లు తెలిసింది.
స్వైన్‌ఫ్లూతో ఇద్దరి మృతి
Published Sat, Jan 17 2015 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM