
నాటకీయ పరిణామాల మధ్య 24 గంటల వ్యవధిలో ఓ యువతి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి విషయంలో ఈ తరం పిల్లలు ఎంత కచ్చితంగా ఉంటున్నారో, వాళ్లను అర్థం చేసుకునే విషయంలో తల్లిదండ్రులు కూడా మారుతున్నారనడానికి ఉదాహరణ.
కనగల్: ఇదో విచిత్రం.. ఓ యువతికి పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగిన మర్నాడు ప్రియుడితో మరోసారి వివాహం జరిగింది. రెండు రోజుల వ్యవధిలోనే ఆమెకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో చోటుచేసుకుంది. శాబ్దులాపురానికి చెందిన మౌనిక కుటుంబం పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటోంది. దేవరకొండకు చెందిన యువకుడితో మౌనికకు పెద్దలు కుదిర్చిన పెళ్లి శుక్రవారం జరిగింది. అయితే వరుసకు మామ అయిన కొండభీమనపల్లికి చెందిన రాజేశ్, మౌనిక కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకలేదు. దీంతో మౌనిక పెద్దల నిర్ణయానికి కట్టుబడి వారు నిశ్చయించిన వరుడితో తాళి కట్టించుకుంది.
సాయింత్రం అప్పగింతల సమయంలో తాను ఎప్పటినుంచో ప్రేమిస్తున్న వరుసకు మామ అయిన రాజేశ్‌ను చూసి తట్టుకోలేక అందరి సమక్షంలో అతడిని పట్టుకుని ఏడ్చింది. ఇది చూసి కంగుతిన్న మౌనిక భర్త పంచాయితీ పెట్టాడు. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. చివరకు పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లిని రద్దు చేసుకుని వాళ్లు వెళ్లిపోయారు. కాగా, శనివారం మౌనిక–రాజేశ్‌లకు గుడిలో ఇరువురి బంధువుల సమక్షంలో ప్రేమపెళ్లి జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment