సిద్దిపేట సభకు వెళ్తూ ఇద్దరు మృతి   | Two people died while going to Siddipet meeting | Sakshi
Sakshi News home page

సిద్దిపేట సభకు వెళ్తూ ఇద్దరు మృతి  

Published Thu, Oct 12 2017 3:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

Two people died while going to Siddipet meeting

కొండాపూర్‌(సంగారెడ్డి): సిద్దిపేట జిల్లాలో జరగనున్న సీఎం సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు రైతులు మరణించారు. సంగారెడ్డి జిల్లా  శేఖాపూర్‌కు చెందిన రైతు ఆసిఫ్‌ పాషా (40), అల్లీపూర్‌కు చెందిన మహబూబ్, అజీమ్‌ అలీ, మాచునూర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్, పొట్‌పల్లికి చెందిన జనార్దన్, మల్‌చెల్మకు చెందిన ఖాజా, మునిపల్లి మండలం పెద్ద చెల్మడకు చెందిన గడీల రచ్చయ్య (54), మరో వ్యక్తి కృష్ణ బుధ వారం ఉదయం జహీరాబాద్‌లో తూఫాన్‌ వాహనం ఎక్కారు.

ఈ క్రమంలో కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ చౌరస్తా వద్ద ముందు వెళ్తున్న తూఫాన్‌ వాహనాన్ని డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆసిఫ్‌ పాషా అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలించే క్రమంలో గడీల రచ్చయ్య మృతి చెందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement