CM Sabha
-
సిద్దిపేట సభకు వెళ్తూ ఇద్దరు మృతి
కొండాపూర్(సంగారెడ్డి): సిద్దిపేట జిల్లాలో జరగనున్న సీఎం సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు రైతులు మరణించారు. సంగారెడ్డి జిల్లా శేఖాపూర్‌కు చెందిన రైతు ఆసిఫ్ పాషా (40), అల్లీపూర్‌కు చెందిన మహబూబ్, అజీమ్ అలీ, మాచునూర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్, పొట్‌పల్లికి చెందిన జనార్దన్, మల్‌చెల్మకు చెందిన ఖాజా, మునిపల్లి మండలం పెద్ద చెల్మడకు చెందిన గడీల రచ్చయ్య (54), మరో వ్యక్తి కృష్ణ బుధ వారం ఉదయం జహీరాబాద్‌లో తూఫాన్ వాహనం ఎక్కారు. ఈ క్రమంలో కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తా వద్ద ముందు వెళ్తున్న తూఫాన్ వాహనాన్ని డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆసిఫ్ పాషా అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలించే క్రమంలో గడీల రచ్చయ్య మృతి చెందాడు. -
నేడు సెలవు.. రేపు దరువు
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పొరుగు జిల్లాలో జరిగే సన్మానం కోసమని మన జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏకంగా 2 వేల స్కూల్ బస్సులను రాజమండ్రి తరలిస్తున్నారు. ఇటీవల దోమలపై దండయాత్ర పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు వచ్చిన సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించిన విష యం విదితమే. తాజాగా.. స్కూల్ బస్సుల కోసం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించటం వివాదాస్పదమవుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి కూడా జనాన్ని తరలించేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల్ని ఇవ్వాలంటూ జిల్లా విద్యా శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు ఆ సంస్థల యాజమాన్యాలకు మౌఖిక ఆదేశాలిచ్చారు. బస్సుల్ని సీఎం సన్మాన సభకు వినియోగిస్తున్న కారణంగా ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించాలని, ఇందుకు బదులుగా సెలవు రోజైన ఆదివారం నాడు తరగతులు నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఏమిటీ దారుణం! ఓ సామాజిక వర్గమంతా తమ వెంటే ఉందని చూపించుకునే కార్యక్రమంలో భాగంగానే సీఎం చంద్రబాబు సన్మానం ఏర్పాటు చేయించుకున్నారని, ఈ సభకు భారీ సంఖ్యలో జనసమీకరణ చేసే బా«ధ్యతను సైతం ఆయనే తన భుజాలకు ఎత్తుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ కమిష¯ŒS చైర్మ¯ŒSగా నియమితులు కాగా, ఆ నియామకం తగదంటూ హైకోర్టు నుంచి అభిశంసన ఎదుర్కొన్న కారెం శివాజీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి సన్మానాలు చేయించుకుంటే తప్పులేదని, సభల పేరుతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించటం ఎంతవరకూ సమంజసమని పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తుంటే.. పాఠశాలలకు ఇష్టారాజ్యంగా సెలవులు ప్రకటించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇదిలావుండగా, సర్కారు తీరుపై ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం గుర్రుగా ఉన్నాయి. రవాణా శాఖ, జిల్లా విద్యా శాఖ అధికారులు బెదిరించి మరీ పాఠశాలల్ని మూయించివేయడం ఏమిటని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్లు అడిగినట్టుగా బస్సులు ఇవ్వకుంటే తమను లక్ష్యంగా చేసుకుని వేధిస్తారని, లేనిపోని నిబంధనలతో తమ బస్సుల్ని రోడ్డుపై తిప్పకుండా చేస్తారని పేరు చెప్పేందుకు ఇష్టపడని విద్యాసంస్థల యజమాని ఒకరు వాపోయారు. జిల్లా వ్యాప్తంగా 1,250కి పైగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఉంటే.. వాటి ఆధ్వర్యంలో సుమారు 2,300 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 2 వేల బస్సుల్ని తరలిస్తే.. విద్యార్థుల్ని తీసుకొచ్చేదెలా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఆదివారం రోజున ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తే.. వాటిని మూయించివేస్తామని, విధిగా నిబంధనలు పాటించి తీరాలని చెప్పే విద్యా శాఖ అధికారులు సీఎం సభ నిమిత్తం శనివారం సెలవు ఇచ్చి, ఆదివారం తరగతులు జరుపుకోవాలని ఆదేశిం చడం హాస్యాస్పదంగా ఉందని యాజ మాన్యాలు అంటున్నాయి. శనివారం స్కూళ్లకు సెలవు ఇచ్చి.. ఆదివారం తరగతులు నిర్వహిస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలని పలువురు వాపోతున్నారు. ఇంతకీ ఎవరు ఆదేశిస్తే.. స్కూళ్లకు సెలవు ఇచ్చారు, ఎవరు అడిగితే స్కూల్ బస్సులను రాజమండ్రి తరలిస్తున్నారన్న ప్రశ్నలకు విద్యా శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అబ్బే.. సెలవు ఆదేశాలివ్వలేదు ప్రైవేటు స్కూళ్లకు శనివారం సెలవు ఇవ్వాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఎవరైనా సీఎం సభకు బస్సులు పంపిస్తే.. దానిమూలంగా పిల్లలను స్కూళ్లకు తీసుకురావటంలో ఇబ్బంది వస్తే సెలవు ఇచ్చుకోవచ్చు. అనధికార సెలవుకు బదులు ఆదివారం పాఠశాల నిర్వహించుకునే అవకాశం కల్పించాం. దీనిపై అధికారికంగా ఆదేశాలేమీ జారీ చేయలేదు. – డి.మధుసూదనరావు, డీఈవో -
చీర చిన్నదాయె.. బిల్లు భారమాయె
ఏలూరు (టూటౌన్) : జిల్లా మహిళా సమాఖ్య, మండల సమాఖ్యల మధ్య సీఎం సభ సందర్భంగా కొనుగోలు చేసిన చీరలు చిచ్చురగిల్చాయి. చిన్న సైజు, నాసిరకం చీరలు అంటగట్టి ఒక్కో చీరకు రూ.250 చెల్లించాలని జిల్లా సమాఖ్య ఒత్తిడి తెస్తోందని మండల,గ్రామ సంఘాల అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గత నెల 16న జిల్లాలో పర్యటించిన సందర్భంగా మహిళా సమాఖ్యలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మహిళా సమాఖ్య నేతృత్వంలో గ్రామ సంఘాల అధ్యక్షులు ఆకర్షణగా కనిపించేందుకు ఒకే రంగు చీరలు ధరించాలని జిల్లా సమాఖ్య భావించింది. ఈ మేరకు జూలై 14న జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జీవమణి రూ.2.25 లక్షలు సమాఖ్య నుంచి అడ్వాన్సుగా తీసుకుని 820 చీరలు కొనుగోలు చేశారు. 15వ తేదీ రాత్రికి వాటిని మండల సమాఖ్యలకు పంపి అక్కడి నుంచి గ్రామ సంఘాలకు పంపారు. అయితే పంపిన చీరలు నాసిరకంగా ఉండడం, చిన్నసైజువి కావడంతో కొన్ని మండలాల్లోని గ్రామ సంఘాల అధ్యక్షులు వాటిని తిరస్కరించారు. మరికొన్ని మండలాల్లో గ్రామ సంఘాలకు ఆ చీరలు సకాలంలో చేరకపోవడంతో ధరించలేదు. జిల్లా సమాఖ్య నుంచి పంపిణీ చేసిన చీర ఒక్కింటికి రూ.250 చెల్లించాలని కొన్నిరోజుల కిందట గ్రామ సంఘాల అధ్యక్షులకు సమాచారం అందించారు. తాము చీరలను తిరస్కరించినా డబ్బు ఎలా అడుగుతున్నారని కొందరు, నాసిరకం, చిన్నసైజు చీరలు పంపి రూ.250 ఎలా చెల్లించమంటారని మిగిలి న వారు జిల్లా సమాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఈ చీరల కొనుగోలు బిల్లుల లెక్కలు కార్యాలయానికి ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంత జరిగినా డీఆర్డీఏ అధికారులు మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చీరల కొనుగోలు విషయంలో అధికారులు అనుమతిలేనట్లు తెలిసింది. అయినా రూ.2.25 లక్షలను జిల్లా సమాఖ్య నుంచి ఎలా ఖర్చు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ చీరల కొనుగోలు వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ రకం చీరలను కొనుగోలు చేసి ఎక్కువ ధర వసూలు చేయాలని చూస్తున్నట్టు సభ్యులు ఆరోపిస్తున్నారు. చీరలను తిరస్కరించాం చీరలు నాణ్యత లోపించటంతో గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు తిరస్కరించా రు. వీరవాసరం మండలానికి 10 చీరలు పంపి రూ. 2,500 వసూలు చేయమని చెప్పారు. చీరలు ఆఫీసులోనే ఉన్నాయి. - ఎం.కృపావతి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి చీరల పొడవు తగ్గింది చింతలపూడి మండలానికి 70 చీరలు పంపారు. అవి పొడువు తక్కువగా ఉన్నాయి. కొంతమంది కట్టుకున్నారు. మరికొందరు తిరస్కరించారు. - కె.పార్వతి, సమాఖ్య జిల్లా కోశాధికారి 820 చీరలు కొనుగోలు చేశాం సీఎం పర్యటన కోసం జిల్లా సమాఖ్య నిధులతో 820 చీరలు కొని పంపిణీ చేశాం. డీఆర్డీ ఏ పీడీ అనుమతితోనే చీరలు కొన్నాం. నాసిరకం అని ఫిర్యాదు ఎవరూ చేయలేదు. - ఎం.జీవమణి, సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బిల్లులు ఆఫీసుకు ఇవ్వలేదు సీఎం పర్యటన నిమిత్తం చీరలు కొనేం దుకు రూ. 2.25 లక్షలు అడ్వాన్సుగా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలికి ఇవ్వటం జరిగింది. నేటి వరకు దానికి సంబంధించిన బిల్లులు కార్యాలయానికి అందలేదు. - డీఆర్డీఏ అకౌంటెంట్ ఎన్.కల్యాణి