సనత్నగర్లో గుర్తుతెలియని మృతదేహం | un identified dead Body found in sanathnagar | Sakshi
Sakshi News home page

సనత్నగర్లో గుర్తుతెలియని మృతదేహం

Published Sun, Apr 26 2015 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

un identified dead Body found in sanathnagar

హైదరాబాద్ సిటీ: సనత్‌నగర్ పరిధిలో లోథా అపార్ట్‌మెంట్ పక్కనున్న చెట్టుపై కరెంటు తీగల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. ఇంతకీ చనిపోయింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కరెంటు షాక్‌తో మృతిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement