
ఏటీఎం కేంద్రంలో కెమికల్ స్ప్రే చేస్తున్న బల్దియా సిబ్బంది
పెద్దపల్లి ,కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లి చౌరస్తాలోని ఎస్‌బీఐ ఏటీఎం స్క్రీన్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఉమ్మిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందితో కెమికల్ స్ప్రే చేయించారు. బ్యాంక్ ఖాతాదారులు విషయం తెలిసి ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఏటీఎం ముందు, ఏటీఎం లోపల కూడా పారిశుధ్య సిబ్బంది కెమికల్ స్ప్రే చేశారు. ఏటీఎం స్క్రీన్‌పై ఉమ్మిన వ్యక్తికోసం బ్యాంక్, పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.(రోడ్డుపై ఉమ్మిన వ్యక్తిపై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment