
నగదు కోసం మహిళను నరికిన దుండగులు
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లోకి గత అర్థరాత్రి దుండగులు ప్రవేశించారు. ఇంట్లో మహిళ ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆమెపై దాడి చేశారు. అయినా ఆమె ససేమిరా అంది. నగలు అడిగితే ఇవ్వనంటావా అంటూ తమతో తెచ్చుకున్న ఆయుధాలతో మహిళ కాళ్లు చేతులు నరికి హత్య చేశారు.
అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారంతోపాటు ఇంట్లోని నగదు తీసుకుని పరారైయ్యారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.