శంకుస్థాపన కార్యక్రమంలో ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ తదితరులు
సాక్షి, వరంగల్ : ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో ఎంపీ వినోద్ కుమార్ సాకారం మరువలేనిదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కమలాపూర్ మండలం ఉప్పల్‌లో 66 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాత హుజురాబాద్ నియోజకవర్గంలో 175 కోట్ల రూపాయలతో 4 జాతీయ రహదారులు నిర్మించుకున్నామని తెలిపారు.
కమలాపూర్ మండలంలో నిత్యం 5000 మంది విద్యార్థులు ఉండేలా విద్యా హబ్ రూపు దిద్దుకుంటుందని, కమలాపూర్ మండలాన్ని సరస్వతి నిలయంగా తయారు చేస్తామని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లోనే కాకుండా రహదారుల విషయంలో కూడా కమలాపూర్ మండలంలో అభివృద్ధి జరుగుతుందని బరోసా ఇచ్చారు. త‍్వరలోనే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆర్వోబీ వంతెనను పూర్తి చేసి కమలాపూర్ ప్రజలకు అంకితం చేస్తామన్నారు.
నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతోంది: ఎంపీ వినోద్
వరంగల్ : దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న పాత కమలాపూర్ నియోజకవర్గ ప్రజల కల ఆర్వోబీ వంతెనతో సాకారం కాబోతోందని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఉప్పల్ వంతెన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి హాఫ్ ఆర్వోబీ వంతెనని, ఇది మొదటిసారిగా నూతన టెక్నాలజీతో రూపుదిద్దుకోబోతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment