నేరేడుచర్లలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, నేరేడుచర్ల : రాష్ట్ర ప్రజలను అన్నివిదాల మోసం చేసిన టీఆర్‌ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నేరేడుచర్లలో నిర్వహించిన రోడ్‌షో ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యందన్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు నేరవేర్చలేదన్నారు. డిసెంబ్ 7న జరిగిన పోలింగ్ తరువాత కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ ఆమెరికాకు పోవడం ఖాయమన్నారు. మహాకూటమి అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ హుజుర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చావా కిరణ్మయి, పార్టీ మండల అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగండ్ల శ్రీధర్, సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యుడు ధనుంజయనాయుడు, కొణతం సత్యనారాయణరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
చింతలపాలెం : మండలంలోని దొండపాడుకు చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గున్నం నాగిరెడ్డి ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరడంతో స్వంత ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. ఆయన తోపాటు గున్నం విజయభాస్కర్‌రెడ్డి, కొండా శ్రీనివాసరెడ్డి, ఎం.చినరంగారెడ్డి, జనార్దరన్‌రెడ్డి, ఇంటూరి నాగిరెడ్డి, బాబు కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపించాలి..
హుజూర్‌నగర్ : నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గోపాలపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక çపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినందున ప్రజలు మరొకమారు తనను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాకూటమి నాయకులు ఈడ్పుగంటి సుబ్బారావు, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, నాగన్నగౌడ్, కిరణ్మయి, మల్లికార్జున్, మంజీనాయక్, వెంకన్న, నాగసైదులు పాల్గొన్నారు.
పట్టు సడలించకుండా ముందుకు సాగాలి : ఉత్తమ్
పాలకవీడు : పట్టు సడలించకుండా ముందుకు సాగాలని హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో పాలకవీడు, జాన్‌పహాడ్, శూన్యంపహాడ్ గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment