nereducherla
-
ఎకరా భూమి..రూ.3.68 లక్షల ఆదాయం
సాక్షి, నల్లగొండ(నేరేడుచర్ల): ఆలోచన ఉంటే ఆదాయ మార్గాలు అనేకం అంటున్నారు.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధి శాంతినగర్‌కు చెందిన బాణావత్ రాజేశ్వరి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఆదాయం పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఈ సాధారణ గృహిణి. మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రాజేశ్వరి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈమె భర్త పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా కుమారుడు హైదరాబాద్‌లో ఉన్నత విద్య (బీటెక్) అభ్యసిస్తున్నాడు. కాలక్షేపానికి మల్లెపూల సాగు రాజేశ్వరి–శ్రీనివాస్ దంపతులకు శాంతినగర్‌లో ఉన్న ఖాళీ స్థలంలో కొంత ఇంటి నిర్మాణానికి పోగా ఎకరా భూమి ఉంది. కుమారుడు హైదరాబాద్‌లో చదువుతుండడంతో పాటు భర్త ఉద్యోగానికి వెళ్తుండడంతో రాజేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉండేది. కాలక్షేపం కోసం రాజేశ్వరి కొన్నేళ్ల క్రితం తమకున్న ఎకరా భూమిలో మల్లెపూల సాగు చేపట్టింది. తైవాన్ జామతో ఏడాదికి రూ.80వేలు అయితే, రాజేశ్వరి అనుకున్న మేరకు ఆదాయం రాకపొవడంతో నాలుగేళ్ల క్రితం మల్లెతోటను తొలగించింది. వాటి స్థానంలో బెంగుళూరు నుంచి తైవాన్ జామ మొక్కలను తీసుకవచ్చి పెంచారు. జామతోట కాపునకు వచ్చి సంవత్సరానికి రెండు కాపుల్లో 80వేల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. అంతరపంటగా ఖర్జూర కాగా, రాజేశ్వరి ఒక్క జామతోటపైనే ఆధారపడకుండా అంతర పంటగా వివిధ రకాలకు చెందిన 100 వరకు ఖర్జూరా మొక్కలు పెంచుతోంది. వీటిలో బరిహి, ఖనిజా, మెట్జోల్, సీసీ, సగాయి. ఆజ్యా, ఆమ్రా వంటి రకాలైన ఖర్జూర మొక్కలను నాలుగేళ్లుగా పెంచుతున్నారు. పంట మరో ఏడాదిలో చేతికి వస్తుంది. మరి కొంతకాలం గడిస్తే వివిధ రకాల ఖర్జూరాలతో ఏడాదికి రూ.5 నుంచి 10లక్షల ఆదాయం వస్తుందని రాజేశ్వరి అంచనా వేస్తున్నారు. తేనెటీగల పెంపకంతో.. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కేవీకేలో తెనే టీగల పెంపకంపై రాజేశ్వరి గత ఏడాది శిక్షణ తీసుకున్నారు. అనంతరం జామ, ఖర్జూర తోటలో అంతర పంటగా తేనే టీగల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజేశ్వరీ తన ఆలోచనను భర్త శ్రీనివాస్‌కు తెలియజేసింది. ఆయన రాజేశ్వరీ సహాయ సహకారాలతో పాటు ప్రోత్సాహాన్ని అందించారు. తేనెటీగల పెంపకానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఒక్కోదానికి 15వేల రూపాయలను వెచ్చించి 14 పెట్టెలను తీసుకవచ్చి పెంచుతున్నారు. తేనె టీగలు బయటకు వెళ్లి పూలలోని మకరందాన్ని ఆస్వాధించేందుకు పెట్టెలు కింది భాగంలో కొంత ఖాళీ స్థలాన్ని వదిలారు. పెట్టెలలోని తేనె టీగలను నియంత్రించేందుకు రాణీ ఈగ ఉంటుంది. తేనె టీగలు ఒక్కసారి పెంపకం మొదలు పెడితే ఒక్కో తేనె టీగ రెండు వేల వరకు గుడ్లు పెడతాయని రాజేశ్వరీ వివరించింది. ఆ గుడ్లు పిల్లలుగా మారి ఎటు వంటి పెట్టుబడి లేకుండా ఫలితాలు ఇస్తాయంటోంది. తేనె టీగల పెంపకం ద్వారా నెలకు 40 కేజీల తేనే ఉత్పత్తి అవుతుందని, కిలో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు.ప్రస్తుతం జామపై ఏడాదికి రూ.80 వేల ఆదాయంతో పాటు తేనెపై రూ.24 వేల ఆదాయం వస్తుంది.ఖర్జూర పంట చేతికి వస్తే ఆదాయం మూడింతలకు పైగా పెగుతుందని రాజేశ్వరి పేర్కొంటోంది. మంచి లాభాలు గడిస్తున్నా కాలక్షేపానికి తొలుత మల్లెపూల సాగు చేపట్టా. ఆ తర్వాత జామ, ఖర్జూర, తేనెటీగల పెంపకంతో మంచి లాభాలు గడిస్తున్నా. తాము పెంచుతున్న తేనె టీగల ద్వారా ఉత్పత్తి అవుతున్న తేనెను పరిసర ప్రాంతాల ప్రజలు తోట దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో మార్కెంటింగ్ చేయడం కూడా సులువుగా ఉంది. ఖర్జూరా పంట చేతికొస్తే ఆదాయం మూడింతలు పెరగనుంది. – బాణావత్ రాజేశ్వరి, నేరేడుచర్ల -
ఏక్ బార్.. అమ్మకముందే భారీ ఆదాయం..!
సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపాలిటీ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్కడ ఏర్పాటు చేయాల్సింది ఏక్ బార్.. వచ్చినవి ఏకంగా 248 దరఖాస్తులు. రాష్ట్రంలోని 72 కొత్త మున్సిపాలిటీల్లో 159 బార్ల ఏర్పాటుకు గత నెల 25న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటైన నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఒక్క లిక్కర్ షాపు కోసం 248 దరఖాస్తులు వచ్చాయి. అతిఎక్కువ దరఖాస్తులు వచ్చిన రెండో మున్సిపాలిటీ నేరేడుచర్లనే. మహబూబ్‌బాద్ జిల్లా తొర్రూర్‌లో ఒక బార్‌కు 278 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం దరఖాస్తు గడువు ముగిసే సమయానికి ఆయా మున్సిపాలిటీల్లో 7,380 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. కాగా, దరఖాస్తు రుసుము కింద ప్రభుత్వ ఖజానాకు రూ.73.78 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. 12 చోట్ల మినహా.. కొత్త బార్ల కోసం మొదట్లో మందకొడిగా దాఖలైన దరఖాస్తులు గడువు సమీపించేకొద్దీ వెల్లువలా వచ్చాయి. మొత్తం 7,378 దరఖాస్తులు వచ్చాయి. 147 షాపులకు 10 కంటే ఎక్కువే దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కొత్తగా ఏడు బార్లు నోటిఫై చేయగా 7, బోధన్ మున్సిపాలిటీలో 3బార్లు నోటిఫై చేయగా 3 దరఖాస్తులు వచ్చాయి. దుబ్బాకలో ఒక షాపునకు 7, అమరచింతలో ఒక షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 55 షాపులకు 1,074 వరకు దరఖాస్తులు వచ్చాయి. కొత్త మద్యం దుకాణాలకుగాను బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రా తీయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు ఎక్సైజ్ కమిషనర్ అదేరోజు డ్రా తీస్తారు. గెలిచినవారికి 17న షాపులు కేటాయించనున్నారు. షాపులు కేటాయించిన మూడు నెలల్లోపు బార్ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ సూచించే అన్ని నిబంధనలను యజమానులు పూర్తి చేయాల్సి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రికార్డు సాక్షి, యాదాద్రి: యాదాద్రి–భువనగిరి జిల్లాలోని నూతన మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్న ఐదు బార్లకు 638 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు రూపంలోనే రూ. 6.38 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. చివరి రోజైన సోమవారం 356 దరఖాస్తులు రావడం పోటీ తీవ్రతకు అద్దంపడుతోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఒక బార్‌కు 277 దరఖాస్తులు వచ్చాయి. చౌటుప్పల్‌లోని రెండు బార్లకు 135, ఆలేరులోని ఒక బార్‌కు 126, మోత్కూరులోని ఒక బార్‌కు 100 దరఖాస్తులు వచ్చాయి. సాక్షి కార్టూన్: ఈ అడ్రస్సా.. ఇలా వెళ్లు ఊర్వశీ బార్ వస్తుంది.. -
కారుకే నేరేడుచర్ల..
సాక్షి, సూర్యాపేట : తీవ్ర ఉత్కంఠ నడుమ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో చెర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. టీఆర్ఎస్కు ఎక్స్అఫీషియో సభ్యులతో 11 ఓట్ల బలం ఉంటే.. కాంగ్రెస్‌కు 10 ఓట్లు ఉండటంతో మెజార్టీ సభ్యులు ఉన్న టీఆర్ఎస్కే నేరేడుచర్ల సొంతమైంది. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని ఎక్స్ అఫీషియో ఓటుగా చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని వాకౌట్ చేసింది. కోరం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. సుభాష్‌రెడ్డి ఓటుతో చైర్మన్ గిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్‌కు చెందిన కేవీపీ రామచందర్‌రావు ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత మంగళవారం ఎన్నిక ఉంటుం దని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడంతో టీఆర్ ఎస్ మరో ఎక్స్ అఫీషియో ఓటును పెట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఎత్తు ఫలించింది. ఎన్నిక వాయిదాకు ముందు కేవీపీ ఓటుతో కాంగ్రెస్‌కు 10 ఓట్లు, టీఆర్ఎస్కు 10 ఓట్లు ఉన్నాయి. దీంతో టాస్ వేస్తే ఎవరికి విజయం దక్కుతుందోనని భావించిన టీఆర్ఎస్.. తిరస్కరించిన కేవీపీ ఓటును మళ్లీ ఎలా జాబితా లో పెడతారని వేసిన పాచికతో ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలో ఇరుపార్టీలకు సమానంగా ఓట్లు ఉండటంతో శేరి సుభాష్‌రెడ్డి ఓటును నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నమోదు చేయించింది. దీంతో ఆ పార్టీ సభ్యుల బలం 11కు చేరింది. సుభాష్‌రెడ్డి పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎన్నిక ప్రారంభానికి ముందు చేర్చారు. తొలి జాబితాతోనే ఎన్నిక చేపట్టాలి ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి ప్రారం భిస్తూ ఓటు హక్కు జాబితాలో ఉన్న వారి పేర్లను సమావేశంలో వెల్లడించారు. దీంతో సుభాష్‌రెడ్డికి ఇప్పుడెలా ఓటు హక్కు కల్పిస్తారని ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ సభ్యులు పీఓను ప్రశ్నించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్ అఫీ షియో సభ్యుడిగా ఓటు హక్కు పొందిన తొలి జాబితాతోనే చైర్మన్ ఎన్నిక చేపట్టాలని, ఆ తర్వాత నమోదు చేసిన సుభాష్‌రెడ్డి పేరును జాబితాలో నుంచి తీసివేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యే ముందు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, అందకే సుభాష్‌రెడ్డి పేరును ఓటు జాబితాలో చేర్చామని పీవో వివరించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈసీ ఆదేశాలనే తాము అనుసరిస్తామని పీఓ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ రాస్తారోకో శేరి సుభాష్‌రెడ్డికి ఓటు హక్కు కల్పించడాన్ని నిరసిస్తూ ఎంపీలు ఉత్తమ్, కేవీపీలు నేరేడుచర్లలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికైన∙మెజార్టీ సభ్యులు బయట ఉన్నా.. ఎన్నిక కాని వారితో చైర్మన్ ఎన్నికను పూర్తిచేశారని విమర్శించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారికే చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని తనకు పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి, ఈసీ చెప్పారన్నారు. ఈ ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తామని ఉత్తమ్ తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా మున్సిపల్ ఎన్నికల్లో పంచారని ఆరోపించారు. -
నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక
-
నెరేడుచర్ల: సస్పెన్స్ వీడినట్టేనా!?
సాక్షి, సూర్యాపేట: నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సినిమా ట్విస్టులను తలపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసేందుకు వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కేవీపీ రామచందర్రావును అధికార టీఆర్ఎస్ అడ్డుకోగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కాసేపట్లో నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి ఓటుపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ కేవీపీకి ఎక్స్అఫీషియో ఓటు కల్పించగా.. తాజాగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి కూడా ఓటు కల్పించింది. దీనిలో భాగంగా ఓటరు లిస్టులో కేవీపీ, సుభాష్ రెడ్డిల పేర్లను చేరుస్తూ ఈసీ కొత్త జాబితా విడుదల చేసింది. దీంతో వీరిద్దరు ఈ రోజు జరగబోయే నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటంతో సస్పెన్ వీడింది. సుభాష్‌రెడ్డి ఓటు చట్టవిరుద్ధం: కాంగ్రెస్ అయితే సుభాష్‌రెడ్డికి ఓటు కల్పించడంపై కాంగ్రెస్ అభ్యంతర వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నెరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి వరకే సమయం ఉందని, కానీ గడువు దాటినా శేరి సుభాష్‌రెడ్డి పేరు నమోదు చేయడం చట్ట విరుద్దమన్నారు. అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాగా, కేవీపీ, సుభాష్‌రెడ్డిల ఓట్లతో టీఆర్ఎస్కు 11, కాంగ్రెస్‌కు 10 మంది సభ్యుల సంఖ్యా బలం ఏర్పడింది. నెరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపును ఏడుగురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ తరుపున 8 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. అయితే టీఆర్ఎస్కు నాలుగు, కాంగ్రెస్‌కు రెండు ఎక్స్‌అపీషియో ఓట్లు లభించనున్నాయి. -
టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ: సైదిరెడ్డి
సాక్షి, నేరేడుచర్ల : టీఆర్ఎస్ పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని హుజూర్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని దాసారం, బూర్గులతండా, బొడలదిన్నె, చింతకుంట్ల, చిల్లేపల్లి, రామగిరి, ముసిఒడ్డుతండా, రామకృష్ణాతండా, పులగంబండ తండా, జగన్నాథతండా, ముత్యాలమ్మకుంటలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24గంటల విద్యుత్ సౌకర్యం, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదిముభారక్ వంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే సాగర్ నీరు రాకుండా అడ్డుపడడంతో పాటు విద్యుత్ కూడా సక్రమంగా రానివ్వరన్నారు. హుజూర్నగర్ కోటలో గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. యువత, మహిళలు, రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమావత్ గీత రాంచందర్, ఎంపీటీసీలు గొడేటి వెంకన్న, నిర్మల రవీందర్, విజయలక్ష్మి, కిరణ్, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మార్కెట్ డైరెక్టర్ మందడి ముత్యంరెడ్డి, మాజీ సర్పంచ్ సిరికొండ సరిత, కోటిరెడ్డి, శ్రీనివాస్, శంకర్, వల్లపురెడ్డి, సాయమ్మ, వెంకటేశ్వర్లు, భిక్షం, శ్రీనునాయక్, గోవింద్ నాయక్ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
మోసపూరిత టీఆర్ఎస్ను ఓడించాలి
సాక్షి, నేరేడుచర్ల : రాష్ట్ర ప్రజలను అన్నివిదాల మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నేరేడుచర్లలో నిర్వహించిన రోడ్‌షో ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యందన్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు నేరవేర్చలేదన్నారు. డిసెంబ్ 7న జరిగిన పోలింగ్ తరువాత కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ ఆమెరికాకు పోవడం ఖాయమన్నారు. మహాకూటమి అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ హుజుర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ చావా కిరణ్మయి, పార్టీ మండల అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగండ్ల శ్రీధర్, సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యుడు ధనుంజయనాయుడు, కొణతం సత్యనారాయణరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు. ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు చింతలపాలెం : మండలంలోని దొండపాడుకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గున్నం నాగిరెడ్డి ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరడంతో స్వంత ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. ఆయన తోపాటు గున్నం విజయభాస్కర్‌రెడ్డి, కొండా శ్రీనివాసరెడ్డి, ఎం.చినరంగారెడ్డి, జనార్దరన్రెడ్డి, ఇంటూరి నాగిరెడ్డి, బాబు కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించాలి.. హుజూర్నగర్ : నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గోపాలపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక çపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినందున ప్రజలు మరొకమారు తనను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాకూటమి నాయకులు ఈడ్పుగంటి సుబ్బారావు, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, నాగన్నగౌడ్, కిరణ్మయి, మల్లికార్జున్, మంజీనాయక్, వెంకన్న, నాగసైదులు పాల్గొన్నారు. పట్టు సడలించకుండా ముందుకు సాగాలి : ఉత్తమ్ పాలకవీడు : పట్టు సడలించకుండా ముందుకు సాగాలని హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో పాలకవీడు, జాన్‌పహాడ్, శూన్యంపహాడ్ గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. -
భగ్నప్రేమికుల బలవన్మరణం
కోదాడ/నేరేడుచర్ల: భగ్నప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థం చేయడాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా, తను లేకుండా జీవించలేనని అమ్మాయి కూడా బలవన్మరణం చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ, నేరేడుచర్లలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నేరేడుచర్లకు చెందిన గూడూరు ప్రశాంత్ (25) అలియాస్ ఉప్పి కోదాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. కోదాడకు వచ్చిపోయే క్రమంలో కోదాడలోని వీటీ కాలనీకి చెందిన శాలిని (18) అనే బంధువుల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. శాలిని కోదాడలోని ఓ డిగ్రీ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజుల క్రితం వీరి ప్రేమకు శాలిని తల్లిదండ్రులకు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వేరే వ్యక్తితో నిశ్చాతార్థం చేశారు. వీడియోకాల్‌లోనే ఆత్మహత్యకు నిర్ణయం నేరేడుచర్లలో శుక్రవారం రాత్రి మిత్రులతో మాట్లాడి ఇంటికి వచ్చాడు. ఉదయం 6 గంటలకే తనను నిద్ర లేపాలని ఎదురింట్లో ఉండే ఓ మహిళకు చెప్పాడు. అయితే.. శనివారం ఉదయం ఆమె వచ్చి తలుపుకొట్టగా ఉలుకూపలుకూలేదు. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగులకొట్టి చూడగా ప్రశాంత్ విగతజీవిగా పడి ఉన్నాడు. అటు కోదాడలో కూడా శాలిని తెల్లవారుజామునే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నా చివరి క్షణంలో వీడియోకాల్ ద్వారా మాట్లాడుకొని ఒకే సమయంలో పురుగుల మందు తాగారు. -
ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం
నేరేడుచర్ల (నల్గొండ జిల్లా) : నేరేడుచర్ల మండలం దాసారం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన సైదులు(25) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం అత్యాచారయత్నం చేశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి పక్కింట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించడంతో బాలిక కేకలు వేసింది. కేకలు విన్న బాలిక తల్లి సహా ఇరుగుపొరుగువారు పరిగెత్తుకురావడంతో బాలికను వదిలేసి నిందితుడు పరుగుతీశాడు. ఈమేరకు బాలిక తల్లిదండ్రులు నేరేడుచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిపు చర్యలు చేపట్టారు. -
పట్టపగలే చోరీ..
నేరుడుచర్ల (నల్లగొండ) : దుండగులు ఓ ఇంట్లో చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నేరుడుచర్ల మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలం కేంద్రంలోని అంజలి స్కూల్ సమీపంలో నివాసముండే డొక్రే నారాయణ అనే వ్యక్తి భార్యతో కలసి బట్టల దుకాణానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రజల మనసు గెలిచినవాడే నాయకుడు
నేరేడుచర్ల, న్యూస్‌లైన్ : ప్రజల మనసు గెలిచిన వారే నిజమైన నాయకుడని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్లలో జరిగిన ఓ శుభకార్యానికి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ కూడలిలో కార్యకర్తలనుద్ధేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న విద్యార్థి అమరులను చూసి చలించి తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదలి 11రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానన్నారు. తాను వదలివేసిన మంత్రి పదవిని తీసుకున్న వారు రౌడీలతో తనను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులు వివాహానికి హాజరయ్యేందుకు వస్తే రౌడీలతో అడ్డగించడం చూస్తే మనం హుజుర్నగర్ నియోజకవర్గంలో ఉన్నామా.. పాకిస్తాన్లో ఉన్నామా.. అన్నది అర్థం కావడం లేదన్నారు. పోలీసులను, రౌడీలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేవారు కనుమరుగు కావడం ఖాయమన్నారు. దాడులు చేయించడం తన నైజం కాదని, పేదవారికి ఆర్థిక సహాయం చేయడం, పేద పిల్లలను చదివించడం, అభివృద్ధి పనులు చేయడం మాత్రమే తనకు తెలుసన్నారు. తనను నేరేడుచర్ల రాకుండా 40మందితోని అడ్డుకుంటే మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ పోకుండా 4 లక్షల మందితో అడ్డుకోవడం పెద్ద పనికాదన్నారు. తాను వదిలేసిన మంత్రి పదవి పొందడం వల్లే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ నియంతృత్వ పోకడలతో నాయకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతన్నారన్నారు. రాత్రి వేళ్లలో నాయకులను, అధికారులను బెదిరించడం నాయకుని లక్షణమా అన్నారు. రానున్న ఎన్నికలలో 50 వేల మెజారీటితో గెలుస్తానని గొప్పలు చేప్పుకునే వారిని 50వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలాంటి నాయకులు ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో ఇలాంటి నాయకులకు తగిన రీతిలో ప్రజలు బుద్దిచెప్పాలన్నారు. దేవుని దయతో తెలంగాణ అమరవీరులు, తాను చేసిన త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం తెలంగాణవాదుల విజయమన్నారు. 4కోట్ల తెలంగాణ ప్రజల అకాంక్షను నేరవేర్చేందుకే సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కోమటిరెడ్డి వెంట నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, మోతీలాల్, కొణతం సీతరాంరెడ్డి, గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
సైదన్న ఉర్సుకు రెడీ
మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా జాన్‌పహాడ్ దర్గా విరాజిల్లుతోంది. నేరేడుచర్ల మండలకేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్‌పహాడ్ దర్గా తెలంగాణలోనే ప్రసిద్ధి చెందింది. ఈ దర్గాను ముస్లింలతో పాటు హిందువులు కూడా అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. భక్తులు తమ కోరుకున్న కోర్కెలు తీరితే కందూరు పేరిట మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 23 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉర్సుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -న్యూస్‌లైన్, నేరేడుచర్ల సుమారు 400 ఏళ్ల క్రితం మద్రాస్ రాష్ట్రంలోని నాగూర్ గ్రామంలో వెలసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను పొరుగున ఉన్న ఆంధ్రరాష్ట్రంలో కూడా ప్రచారం చేయాలని తలచి జాన్‌పహాడ్ సైదా, బాజీ సైదా, మొయినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారన్న కథనం ప్రచారంలో ఉంది. ఈ ముగ్గురు భక్తులు ఆంధ్రరాష్ట్రానికి చేరి నాగూర్ షరీఫ్ గొప్పతనాన్ని చాటుతూ ఊరూరా తిరగసాగారు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి వారు అమరులయ్యారు. వాడపల్లి వద్ద అమరుడైన జాన్‌పహాడ్ సైదా జ్ఞాపకార్థం వజీరాబాద్ రాజకుమారుడు జాన్‌పహాడ్ వద్ద సమాధులు కట్టించారని చెబుతుంటారు. దీంతో జాన్‌పహాడ్ సైదాగా పేరొచ్చిందని ఆ తరువాత జాన్‌పహాడ్ దర్గాగా వాడుకలోకి వచ్చిందని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో నీటి వసతి లేదని బెంబేలు పడుతున్న తరుణంలో వేముల శేషారెడ్డి తండ్రి మట్టారెడ్డి కలలో జాన్‌పహాడ్ సైదా కన్పించి గుర్రపు డెక్కలు ఉన్నచోట బావిని తవ్వాలని చెప్పినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. దర్గా అంతా అడవి ప్రాంతం కావడంతో తన దగ్గరకు వచ్చిన భక్తులు భయపడకుండా రక్షణ కోసం అక్కడ ఒక నాగుపామును, పెద్ద పులిని కూడా ఏర్పాటుచేసినట్లు పూర్వికులు చెబుతారు. కందూరు... జాన్‌పహాడ్ దర్గా వద్దకు ప్రతి శుక్రవారం దర్శనానికి వచ్చేవారు, ఉర్సుకు వచ్చే వారు అక్కడ తీర్చుకొనేమొక్కును కందూరు అంటారు. కందూరు మొక్కులలో.. మేకపోతును, గొర్రెపొట్టేలును నివేదన ఇవ్వడం అచారంగా వస్తోంది. భక్తులు తమ మొక్కు ప్రకారం మేకపోతులు లేదా గొర్రె పొట్టేళ్లను తీసువచ్చి వాటికి స్నానం చేయించిన అనంతరం హలాల్ చేయించి సఫాయి బావి నీటితో వండుతారు. అనంతరం దర్గాలో నివేదన (ఫాతెహాలు)ఇవ్వడమే గాక మొక్కు చెల్లించుకుంటారు. ఆ తరువాత బంధుమిత్రులకు భోజనాలు పెడతారు. ఇలా చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని భావిస్తుంటారు. గొల్లభామ గుట్ట ... మత ప్రచారం సందర్భంగా జరిగిన యుద్ధ సమయంలో ఓ గొల్లభామ రావిపహాడ్ గ్రామం నుంచి వాడపల్లి వె ళ్తూ అటుగా వచ్చింది. ఆమె అందంగా ఉంటుంది. మం చి మాటకారి కూడా. అయితే ఈ యుద్ధం దృశ్యాన్ని చూ స్తూ వెళ్తున్న ఆమెను సైదులుబాబా గమనించారు. ‘ ఓ అమ్మాయి చూసినంత చూశావు.. ఇక నువ్వు వెనకకు చూడకుండా వెళ్లిపో.. ఒక వేళ తొందరపడి వెనక్కు చూ శావో అక్కడే శిలవైపోతావు. జాగ్రత్తగా వెళ్లు’ అని బాబా హెచ్చరించారు. బాబా ఆదేశాలు విన్న గొల్లభామ ముం దుకు సాగిపోయింది. కానీ కొంతదూరం వెళ్లాక .. ఆమె కు యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలనిపించింది. వెంటనే వెనకకు చూసింది. అంతే మరుక్షణంలో ఆమె శిలగా మారిపోయిందని మరో కథ ప్రచారంలో ఉంది. గొల్లభామ శిలగా మారిన ఆ ప్రాంతాన్ని ఇక్కడి వారు గొల్లభామగుట్టగా భావించి పవిత్రంగా నమస్కరిస్తారు. వచ్చిన భక్తులు తలా ఒక రాయి ఆమెకు సమర్పించి స్మరించుకుంటుంటారు. మూడు రోజుల పాటు.. ఈ నెల 23, 24, 25 తేదీలలో ఉర్సు జరుగుతుంది. 23న దర్గాలో కొవ్వొత్తులతో ఉల్సా నిర్వహిస్తారు. 24న వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి తెచ్చిన పవిత్ర గంధాన్ని గుర్రంపై జాన్‌పహాడ్ పురవీధుల్లో ఊరేగించి దర్గాలో సమాధులపైకి ఎక్కిస్తారు. 25న దర్గాలో దీపారాధన చేయడంతో ఉర్సు ముగుస్తుంది. జాన్‌పహాడ్‌కు బస్సుల సౌకర్యం ఇలా.. మిర్యాలగూడ డిపో నుంచి దామరచర్ల మీదుగా జాన్‌పహాడ్ వరకు. సూర్యాపేట ఆర్టీసీ డిపో నుంచి నేరేడుచర్ల మండల కేంద్రం మీదుగా .. కోదాడ డిపో నుంచి నేరేడుచర్ల మీదుగా.. కొనసాగుతున్న అభివృద్ధి పనులు జాన్‌పహాడ్ దర్గా వద్ద రూ.50లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో నిర్వహించనున్న ఉర్సు నాటికి ఈ పనులు పూర్తి చేయనున్నారు. వక్ఫ్‌బోర్డు నుంచి మంజూరైన రూ.50లక్షల నిధులతో చేపట్టనున్న పనులను గత సంవత్సరం జూన్ 9న గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు వాటర్ ట్యాంకులు, సందల్‌ఖానా, అతిథిగృహం, వసతిగృహాలు, దర్గాలో క్యూలైన్ల ఏర్పాటు చేపడతున్నారు. ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేయనున్నట్లు దర్గా కాంట్రాక్టర్ ఎంవీ సుబ్బారావు తెలిపారు. ఉర్సు సందర్భంగా దర్గా వద్ద భద్రతా ఏర్పాట్లను సీఐ బలవంతయ్య పర్యవేక్షించారు. భక్తులు సులభంగా వెళ్లేందుకు దుకాణ సముదాయాలు, పరిసర ప్రాంతాలు, వాహనాల పార్కింగ్, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయన పరిశీలించారు. సఫాయిబావి.. జాన్‌పహాడ్ దర్గాకు వెళ్లే దారిలో మొద ట కుడివైపున ఒక దిగుడుబావి ఉంది. ఇది విచిత్రంగా ఒక గుహ వలె కన్పిస్తుంది. బాగా లోతులో నీళ్లు ఉం టాయి. జాన్పహా డ్ దర్గాను దర్శించుకునే భక్తులు ఈ బావి నీటిని తెచ్చుకొని పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నీటితోనే వంటలు చేసుకుంటారు. ఇది చాలా పవిత్రమైన నీరున్న బావి. అందుకే దీనిని సఫాయి బావి అంటారు. ఈ బావి నీటితో స్నానం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ బావిలోని నీటిని పంటలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని విశ్వసిస్తారు. ఆలాగే పశువులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉండి చక్కని పాడినిస్తాయని చెబుతారు. తీరని సమస్యలు జాన్‌పహాడ్ దర్గాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణకు ఇక్కడ బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనను వక్ఫ్‌బోర్డు పంపినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. జాన్‌పహాడ్ దర్గాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చినా ఇంతవరకు అమలుకాలేదు. దర్గాకు వచ్చే భక్తులకు స్నానాల గదులు, మరుగుదొడ్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. దర్గా సమీపంలోని వీధులన్నీ అపరిశుభ్రంగా దుమ్ము, ధూళితో నిండి ఉన్నాయి. దర్గా పరిసర ప్రాంతాన్ని సీసీతో నిర్మాణం చేపట్టాలి నాగులపుట్ట.. దర్గా వద్ద వేపచెట్టు మొదట వెలసిన పుట్ట వద్ద మహిళలు కొబ్బరికాయలు కొట్టి పుట్టలో పాలు, పండ్లు, గుడ్లు పెట్టి పూజలు చేస్తుంటారు. సంతానం లేని మహిళలు పుట్ట చుట్టూ పానసానం పడుకొని శోకిస్తుంటారు. దర్గా దర్శనం అనంతరం నాగులపుట్టకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.