ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వెళుతోంది: ఉత్తమ్‌ | Uttam Kumar Reddy Meets Governor Tamilisai In Raj Bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో భేటీ అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

Published Mon, May 4 2020 12:20 PM | Last Updated on Mon, May 4 2020 6:33 PM

Uttam Kumar Reddy Meets Governor Tamilisai In Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌లో రైతుల సమస్యలు, కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ గవర్నర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలుతో కలిసి గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే వలస కూలీల విషయంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునేలా ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకోవాలని లేఖ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఆర్థికంగా చితికిపోయిన పేదలను ఆదుకోవాలని కోరింది. (తండ్రి మరణించినా.. స్వదేశం రాలేక..!)

గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదో గవర్నర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఖరి ఆన్ సైంటిఫిక్ ఉందని, ప్రభుత్వ పెద్దలు ఏక పక్ష ధోరణితో వెళ్తున్నారని విమర్శించారు. ఐసీఎమ్‌ఆర్‌ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ని పరీక్షలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కరోనా ఫ్రీ కావాలని కోరుకుంటున్నామని, తెలంగాణలో మరణాలు చూపెట్టడం లేదని ఆరోపించారు. చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎందుకు ఇచ్చారని,  కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని, ప్రతి బీపీఎల్ కుటుంబానికి రూ. 5 వేల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు ఉత్తమ్‌ తెలిపారు. రాష్ట్రంలో పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని గవర్నర్‌కు చూపించామన్నారు. నిరుపేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. 26 మార్చి రోజు కేజీ కంది పప్పు ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారని, ఇప్పటి వరకు కంది పప్పు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంత మంది వలస కూలీలు ఉన్నారో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని, వలస కూలీలు వెళ్ళిపోతే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. వలస కూలీలకు సరైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. రూ. 20 కోట్ల బస్తాలు అవసరమని, బస్తాలు లేక వరి కొనుగోళ్లు ఆగిపోయాయని పేర్కొన్నారు.

అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసిందని, తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్ చాలా అందంగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి స్థాయిలో జరగడం లేదని దుయ్యబట్టారు. హమాలీల చార్జీలను ప్రభుత్వమే భరించాలన్నారు. కందుల పైసలు రైతులకు ఇంకా ఇయ్యలేదని, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెప్పే కేసీఆర్.. రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. (కొత్తజంటకు పోలీసుల రిసెప్షన్‌! )

రేపు కాంగ్రెస్‌ ఒకరోజు దీక్ష
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా మంగళవారం ఒక రోజు దీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పీసీసీ, డీసీసీ కార్యాలయాలు, స్టానిక సేకరణ కేంద్రాలు, పార్టీ నేతల ఇళ్లలో ఈ దక్షలు చేపట్టాలని టీపీసీసీ డీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌, మాజీ మంతత్రి ఎం. శశిధర్‌రెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. (షారుఖ్ పాట‌.. ఆప‌మ‌న్న బేటా )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement