రైతాంగం సంక్షోభంలో ఉంది: ఉత్తమ్
డిచ్ పల్లి: పంట నష్టాన్ని అంచనా వేయడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగిలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించి, వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. రాష్ట్రంలో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు వెంటనే పంట నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో కూడా వారికి పూర్తిగా ఉపశమనం కల్పించి.. పూర్తిగా వారి రుణాలు మాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, పార్టీకి చెందిన నేతలు ఉత్తమ్ తో కలిసి నిజామాబాద్ జిల్లా రైతులను పరామర్శించారు.