రాహుల్ గాంధీని సన్మానిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే గంగారాం
కామారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. తమ అధినేత ప్రసంగం పార్టీ కార్యకర్తలను ఫిదా చేసింది. రుణమాఫీ, పంటలకు మద్దతు, లక్ష ఉద్యోగాల కల్పన హామీలపై జనం కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్ర జా గర్జన సభ విజయవంతమైంది. ప్రజలు భారీ గా తరలివచ్చారు. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమం కొనసాగింది నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే అంటూ తెలుగులో నీళ్లు, నిధులు, నియామకాలు అన్న పదాలను ఉచ్చరించినప్పుడు పార్టీ శ్రేణులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశాయి. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నపుడు పలుమార్లు కార్యకర్తలు ఈలలు వే స్తూ, చప్పట్లు కొడుతూ, జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
రైతులకు రూ.2 లక్షల రుణమా ఫీ, పంటలకు మద్దతు ధరలు ఇవ్వడం, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల కల్పన వంటి అంశాలను ప్రముఖంగా పేర్కొనడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సా హం నింపింది. బహిరంగ సభనుద్దేశించి మాట్లాడిన పలువురు నేతలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని గుర్తు చేసుకున్నారు. యూపీఏ ప్రభు త్వం రైతుల రుణాలను మాఫీ చేసిన సందర్భంగా రాష్ట్రంలో రైతుల రుణాలు రూ. 12 వేల కోట్ల మా ఫీ అయ్యాయని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
రుణమాఫీ కాని రైతుల కోసం అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు బోనస్‌గా రూ. 5 వేల కోట్లు అదనంగా ఇచ్చి ఆదుకున్నారన్నారు. సభలో వైఎస్సార్ పేరు ప్రస్తావించగానే కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల రుణ మాఫీ విషయంలో మో సం చేసిందని, తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షలు మాఫీ చేస్తామని తెలపడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలన ప్రజావ్యతిరేఖమైనదని కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు..
కామారెడ్డిలో జరిగిన సభకు జిల్లాలోని నాలుగు ని యోజక వర్గాల నుంచే కాక నిజామాబాద్ జిల్లాలో ని ఐదు నియోజక వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. రోడ్డుపై వేలాది మంది జనం గుమిగూడారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్న సమ యంలో కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి రానివ్వాల ని కోరారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బారికేడ్లను తొల గించాలని పోలీసులకు సూచించారు. దీంతో వే లాది మంది సభా ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చా రు. సభా ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల రోడ్ల పై జనం కిక్కిరిసిపోయారు. అలాగే భవనాలపైకి ఎక్కి సభను వీక్షించారు. ప్రాంగణం బయట జనానికి కనబడడానికి భారీ స్క్రీన్లు ఏర్పాటు చే శారు. సభా ప్రాంగణంలో ఏవూరి సోమన్న ఆధ్వర్యంలో కళాబృందం ఆట, పాటలతో కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
రోడ్లపై కిక్కిరిసిన జనం..
జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లపై జనం కిక్కిరిసిపోయారు. పట్టణంలోని కొత్త బస్టాండ్‌కు సమీపంలోని సీఎస్‌ఐ చర్చి వద్ద వాహనాలను సభవైపు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. సీఎస్‌ఐ గ్రౌండ్‌లో వాహనాలను పార్కింగ్ చేయించారు. అక్కడి నుంచి డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వరకు వేలాది మందితో రద్దీగా మారింది. సభ ప్రారంభానికి ముందు నుంచి సభ పూర్తయిన తరువాత కూడా వేలాది మందితో రోడ్లు కిక్కిరిసిపోయాయి.
పార్కింగ్‌కు సీఎస్‌ఐ గ్రౌండ్ సరిపోకపోవడంతో వాహనాలను పట్టణంలోని విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్, శ్రీనివాసనగర్, అశోక్‌నగర్, శ్రీరాంనగర్ తదితర ప్రాంతాల్లోని వీధుల్లో పార్కింగ్ చేయించారు. సభకు శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అధ్యక్షత వహించగా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, సంపత్, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, నాయకులు కుంతియా, మదన్‌మోహన్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment