
రైతుల కన్నా ఎమ్మెల్యేలే ముఖ్యమా?
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలను పెంచడం ఎంతవరకు సబబు అని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం మాట్లాడుతూ.. తీవ్రమైన కరువు, రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలు పరిష్కరించిన తర్వాతే ప్రజాప్రతినిధుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను హర్షిస్తున్నట్లు పేర్కొన్నారు.