
చిన్న వ్యాన్‌లో కిక్కిరిసి కూర్చున్న చిన్నారులు
దేవరకొండ : ఈ ఫొటో చూడండి.. బోనులో కుక్కపిల్లల మాదిరిగా చిన్నవ్యాన్‌లో ఈ చిన్నారులను కుక్కారు. ఇది చందంపేట మండలం తెల్దేవర్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాల చిన్న పిల్లలను స్కూల్‌కు చేరవేసే చేసే సెవన్ సీటర్ ఆటో. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఆ చుట్టుపక్కల తండాలకు విద్యార్థులను ఇలా కిక్కిరిసేలా ఎక్కించుకుని ఇళ్లకు చేరుస్తున్నారు. ఏడుగురు ప్రయాణించాల్సిన ఆటోలో 25 మందిని తరలిస్తున్నారంటే.. ఎంత ప్రమాదకరమో ఇట్టే తెలిసిపోతుంది.
శుక్రవారం 25 మంది చిన్నారులను ఒకరిపై ఒకరిని కూర్చోబెట్టుకుని వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఓ లారీకి ఈ ఆటోకు మధ్య ప్రమాదం తప్పడంతో.. ఆ లారీడ్రైవర్‌తో ఆటోడ్రైవర్ గొడవ పడుతూ ‘సాక్షి’కి ఇలా కనిపించాడు. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు, చైల్డ్ రైట్స్ కమిషన్, విద్యాశాఖ అధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment