ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న వనమా వెంకటేశ్వరరావు
పాల్వంచరూరల్/సుజాతనగర్: వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయ మని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వర్‌రావు అన్నారు. త్యా గాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని, దానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం సుజాతనగర్ నుంచి కొత్తగూడెం మీదుగా పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి వరకు 3000 మోటార్‌సైకిళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని అన్నారు.
పోడు రైతులకు పట్టాలు, భూములను పంపిణీ చేస్తామంటూ రాజకీయ ఉనికి కోసం టీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడిస్తేనే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అ న్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉం టానని, తాను ఇక్కడే పుట్టా నని. తుదిశ్వాస వరకు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. గెలిచే అభ్య«ర్థులకే టికెట్ ఇవ్వాలని రాహుల్‌గాంధీ నిర్ణయించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తొలుత నాయకులగూడెం గ్రామంలోని అయ్యప్ప ఆలయం వద్ద కార్యకర్తలు వనమాకు ఘన స్వాగతం పలికారు. జై వనమా, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు జి.వి.భద్రం, మహిపతి రామలింగం, కొత్వాల శ్రీనివాసరావు, వనమా రాఘవేంద్రరావు, ఎస్‌వీఆర్‌కె. అచార్యులు, వనమా రామకృష్ణ, ఎంఏ రజాక్, కాసుల వెంకట్, అన్వర్, విజయ్,మురళి, రంజిత్, నందనాయక్, జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, కాసుల ఉమారాణి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వీరయ్య, రెడ్డెం తులసిరెడ్డి, ఎంపీటీసీలు కట్టా నరసింహరావు, సువాలి, మోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment