
వివిధ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులను ఆయా జిల్లాల కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బండ నరేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన మూడవసారి ఎన్నికవడం విశేషం.
ఆదిలాబాద్ తూర్పు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పురాణం సతీష్ను, పశ్చిమ జిల్లా అధ్యక్షుడుగా లోక భూమారెడ్డిని కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఈద శంకర్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.