
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నాయకత్వం 5 జిల్లా లకు అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు కె.సత్యయాదవ్‌ను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎస్.వెంకటయ్య, కె,.వెంకట్‌రాములు, కె.రాములు.. సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సీహెచ్ ఉమామహేశ్వర్‌రావు, వై.వెంకటనరసయ్య, ఆర్.ఉమ, వి.రమేశ్ నియమితులయ్యారు.
ఇక నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా రితేశ్ రాథోడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఆకుల శ్రీనివాస్, దశరథ్, ఆడెపు లలిత, పి.సతీశ్వర్‌రావు, కె.అశోక్.. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బైరి శంకర్‌ముదిరాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తోట స్వరూప, వి.రామచంద్రారెడ్డి, వేణుమాధవ్, ఎస్.సత్త య్య, ఎస్.యాదగిరి.. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆర్.గోపీ ముదిరాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కె.కృష్ణస్వామి, జ్ఞానరామస్వామి నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment