విదేశాల్లో బాబుకు భద్రత కల్పించింది ఎవరు?
న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఏపీ నాయకులు, ప్రజలకు భద్రత లేదన్న టీడీపీ మంత్రులపై ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి విరుచుకుపడ్డారు. భద్రత కోసం తమ రాష్ట్ర పోలీసులనే వినియోగించాలనే ఏపీ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.
'సింగపూర్, చైనా దేశాలలో పర్యటించిన సమయంలో చంద్రబాబుకు భద్రత కల్పించింది ఎవరు? అక్కడి ప్రభుత్వాలా? లేక ఏపీ పోలీసులా?' అని వేణుగోపాలాచారి ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ చంద్రబాబు రాజ్యాంగ వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు స్వరమేనని, లై డిటెక్టర్ పరీక్షలు జరిపినా అదేవిషయాన్ని ఘంటాపథంగా చెబుతానని చారి అన్నారు.