
తరిమికొడతామన్నారు.. మరిచారా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత ప్రజల పట్ల, హైదరాబాద్‌లో స్థిరపడిన వారి విషయంలో టీఆర్‌ఎస్ వ్యవహరించిన తీరును మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం భీమవరం నుంచి పోటీ చేస్తా, కోడిపందేలను రెగ్యులరైజ్ చేయాలని మాట్లాడుతున్న కేటీఆర్‌కు ఇక్కడ స్థిరపడిన ఏపీవారిని తరిమికొడతామన్న మాటలు గుర్తులేవా అని ప్రశ్నించారు.
గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమం ముసుగులో సినిమా వాళ్లను బెదిరించి, ఆంధ్రా ప్రజలను హీనంగా చూసిన టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు నాటకాలాడుతున్నారన్నారు.