నాగార్జునసాగర్ (నల్లగొండ): నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం, వరద నీటి రాక, దిగువకు వదిలే నీటి పరిమాణం తదితర విషయాలను వైద్యనాథన్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం అంచనా వేసింది. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణా జలాలపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా శుక్రవారం సాగర్‌ను వైద్యనాథన్ కమిటీ సందర్శించింది. సుప్రీంకోర్టులో మన రాష్ట్రానికి కృష్ణా జలాల వాటాపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వైద్యనాథన్ నేతృత్వంలో విశ్రాంత ఇంజినీర్లతో కూడిన 12 మంది కమిటీ సభ్యులు వచ్చారు. ప్రాజెక్టు అధికారుల వద్ద వివరాలు సేకరించారు.
ప్రధాన ప్రాజెక్టుతో పాటు స్పిల్‌వేను సందర్శించారు. వివాదాస్పదమైన కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ నుంచి వెలుపలికి వచ్చే నీరు, విద్యుదుత్పాదన అనంతరం బయటకు వచ్చి ప్రధాన కాల్వలో కలిసిన చోటగల వాటర్‌స్కేల్‌ను పరిశీలించారు. అనంతరం హాలియా వద్ద వాగుపై నిర్మించిన అక్విడెక్ట్ సందర్శించారు. వారి వెంట సాగర్ డ్యాం చీఫ్ ఇంజినీర్ పురుషోత్తమరాజు, ఎస్‌ఈ విజయభాస్కర్‌రావు తదితరులు ఉన్నారు.
సాగర్‌ను సందర్శించిన వైద్యనాథన్ కమిటీ
Published Fri, Jun 12 2015 5:12 PM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement