హైదరాబాద్: ‘విజయ’ నూనె కల్తీ కాదని, శుద్ధమైనదేనని ధ్రువీకరించాల్సిం దిగా సర్కారుకు డీలర్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం విజయ నూనెలో కల్తీ ఉన్నట్లు బయటపడటంతో మార్కెట్లో సగానికిపైగా విక్రయాలు తగ్గిపోయినట్లు తెలిసింది. దీంతో డీలర్లు, వ్యాపారులు అధికారులను కలిసి విజయ నూనె లో కల్తీ లేదని ప్రకటన చేయాల్సిందిగా కోరారు. కానీ అధికారులు అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ‘విజయ’ బ్రాండ్‌తో పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరుశనగ, రైస్‌బ్రాన్, నువ్వుల నూనెలను విక్రయిస్తున్నారు.
స్లన్‌ఫ్లవర్, శనగ నూనె రోజుకు 50 వేల కేజీలకుపైగా అమ్మకాలు జరుగుతాయి. విక్రయాలకు 240 మంది డీలర్లు ఉన్నారు. పచ్చళ్ల సీజన్ కావడంతో వేరుశనగ నూనెకు భారీ డిమాండ్ ఉంది. దీంతో వ్యాపారులు చాలా బిజీగా ఉన్నారు. కానీ ఒక్కసారిగా కల్తీ జరిగినట్లు బయటపడటం, ఓ అధికారిని సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
‘కల్తీ’పై సర్కార్‌కు విజయ డీలర్ల మొర
Published Tue, May 19 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement