
బన్సీలాల్‌పేట్: వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ గురువారం సీజీఓ టవర్స్‌లోని సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ టైటిల్ మార్చాలని బోయ కులస్తులు తీవ్ర ఆందోళన చేస్తున్నారన్నారు. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడి పేరు మీద సినిమా తీయడం సరైంది కాదన్నారు. వెంటనే సినిమా పేరును మార్చాలని భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ ఎం.సుభాశ్‌చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సెన్సార్ బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖను విడుదల చేశారు.