అభివృద్ధికి కేరాఫ్‌ టీఆర్‌ఎస్‌ | Vote For TRS For Development Mahabubnagar Srinivasgoud | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి కేరాఫ్‌ టీఆర్‌ఎస్‌

Published Sat, Nov 10 2018 12:53 PM | Last Updated on Sat, Nov 10 2018 12:58 PM

Vote For TRS For Development Mahabubnagar Srinivasgoud - Sakshi

ప్రచారంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌  

సాక్షి,జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): 60ఏళ్లుగా జర గని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని, అభివృద్ధికి కేరాఫ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అని మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఇంటింటి ప్రచారంలో శుక్రవారం ఆయన మైత్రినగర్, భగీరథకాలనీ, క్రిస్టియన్‌పల్లి ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. తాను చేసిన అభివృద్ధిని వివరిస్తు మళ్లీ గెలిస్తే చేపట్టేబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మరోసారి అవకాశం ఇవ్వాలని, గతంలో చేసిన దానికంటే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను అభ్యర్థించా రు. కాగా, పాలమూరు పచ్చబడాలంటే టీఆర్‌ఎ స్‌ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని, కూటమి గెలిస్తే పాలమూరు మళ్లీ ఎడారి కావడం ఖాయమన్నారు. కృష్ణానదిలో వాటా పాలమూరుకు దక్కకుంటే నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలించుకుపోతారని అన్నారు. అదేవిధంగా రామయ్యబౌలికి చెందిన ఖాజామైనోద్దీన్, రాఘవేందర్‌గౌడ్, ప్రవీన్, లడ్డు, గంగాధర్, శ్రీకాంత్, దత్తు, నరేష్, కాంత్రి తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల ఖర్చు కింద రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ. 25వేలు అందజేశారు. కార్యక్రమాల్లో స్పోర్ట్స్‌ అథారటీ రాష్ట్ర చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధ, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, కృష్ణమోహన్, రమేష్, రాములు, కృష్ణ ముదిరాజ్, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ బాధ్యులు సుధాకర్, సుదర్శన్, వెంకటయ్య, లక్ష్మీనారాయణ, సత్యన్న, అంజిలయ్య, దేవేందర్, సత్యనారాయణ, తమ్మ య్య, హన్మంతురెడ్డి, రాజసింహుడు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.  
శ్రీనివాస్‌గౌడ్‌ సతీమణి ముమ్మర ప్రచారం 
మహబూబ్‌నగర్‌ రూరల్‌: మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ గెలుపునకు ఆయన సతీమణి శారద శుక్రవారం మండలంలోని ఓబ్లాయిపల్లి, అప్పాయిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి శ్రీనివాస్‌గౌడ్‌కు ఓటువేసి గెలిపించాలని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఓటర్లను కోరారు. ఆమె వెంట ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యురాలు వై.శ్రీదేవి, మాజీ సర్పంచ్‌లు రామకిష్టమ్మ, ప్రియాంక, నాగయ్య, మాజీ ఉప సర్పంచ్‌ అలావోద్దీన్, ఎంపీటీసీ చంద్రకళ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ మల్లు నర్సింహారెడ్డి, మండల ప్రచార కార్యదర్శి పి.రవీందర్‌రెడ్డి, మన్యంకొండ దేవస్థాన కమిటీ సభ్యులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, రాజవర్ధన్‌రెడ్డి, వెంకటస్వామి, లక్ష్మారెడ్డి, డి.ఆంజనేయులు, కార్యదర్శి కతల్‌పాష పాల్గొన్నారు. 
హన్వాడలో..
హన్వాడ: మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వివరిస్తూ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారానే అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు రాముగౌడ్, కృష్ణయ్యగౌడ్, మాధవులుగౌడ్, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు . 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement