
ఆదిలాబాద్‌టౌన్: పార్టీలో చేరిన వారితో జోగు రామన్న
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పలువురు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పు చ్చుకుంటున్నారని ఆపద్ధర్మ మంత్రి జోగురామ న్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్, శాంతినగర్ కాలనీల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో జోగురామన్న సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా రామన్న వారికి పార్టీ కండువాల ను కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మా ట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం చేసిన పథకాలను చూసే ప్రజలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఇందులో భా గంగానే ఈ కాలనీల్లోని మహిళలు, యువకులు సైతం పార్టీలో చేరినట్లు వివరించారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లోక భూమారెడ్డి, అయ్యుబ్, యూసుఫ్, షేక్ అజీమ్, రాథోడ్ దత్తు, కార్తిక్, హేమంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment