ఓరుగల్లుకు పెళ్లికళ | Warangal to the marriage of art | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుకు పెళ్లికళ

Published Thu, Jan 22 2015 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

ఓరుగల్లుకు  పెళ్లికళ

ఓరుగల్లుకు పెళ్లికళ

నేటి నుంచి మోగనున్న బాజా
 
పోచమ్మమైదాన్ : జిల్లాకు పెళ్లి కళొచ్చింది.. మాఘమాసం శుభ ముహూర్తాలను మోసుకొచ్చింది.. నెల రోజుల విరామం తర్వాత మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి.. ముహూర్తాలు ఖరారు చేసుకున్న వారు పెళ్లి పనులకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే వస్త్ర, బంగారు షాపుల్లో సందడి నెలకొంది. పెళ్లిళ్ల కోసం జిల్లాలోని కల్యాణ మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. డిసెంబర్ 18వ తేదీతో ముగిసిన పెళ్లి ముహూర్తాలు మళ్లీ మూడం ముగిశాక గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఈనెల 25న వసంత పంచమి కావడంతో మంచి ముహూర్తం అని పండితులు చెబుతున్నారు. బలమైన ముహూర్తం కావడంతో ఆ రోజు వందల సంఖ్యలో జిల్లాలో వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు.

గురువారం రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో నగరంలో కల్యాణ మండపాలు, గార్డెన్లు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఫొటో,  వీడియో, పురోహితులకు, టెంట్‌హౌస్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. నగరంలోని ప్రముఖ కల్యాణ మండపాలతోపాటు చిన్న, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాళ్లు, ట్రావెల్స్, ఫ్లవర్ డెకరేషన్ ట్రూప్స్, సన్నాయి బృందాలను ముందుగానే రిజర్వు చే సుకుంటున్నారు. చిన్న, పెద్దపెద్ద హోటళ్ల రూమ్స్ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. నగరంలో 70కి పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీ అయ్యాయి.
 
ముచ్చటైన వేదికలు

పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలోని కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు వేదికలుగా నిలుస్తున్నాయి. నగరంలో మరికొందరు పెద్ద గ్రౌండ్‌లను ఎంచుకుంటున్నారు. అపురూపమైన సెట్టింగ్‌లు, ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. సెట్టింగ్‌లు వేసేందుకు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల నుంచి ఆర్ట్ డెరైక్టర్లను రప్పిస్తున్నారు. ఎల్‌ఈడీ టీవీలు, స్క్రీన్‌లు ఏర్పాటు చేసి వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాలులో ఉన్న వారు ఎంతో క్లోజ్‌గా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
 
 పుష్య మాసం ముగిసిన తరువాత మళ్లీ ఇప్పుడే పెళ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. మాగ, ఫాల్గుణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ కొత్త పంచాంగంలోనే ముహూర్తాలు ఉన్నాయి. ఈనెల 25న వసంత పంచమి కావడంతో ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు ఉంటాయి.
 - శివశ్రీ బోగీశ్వరశాస్త్రి,
 శ్రీపంచముఖ వీరేశ్వరాలయం అర్చకుడు, వరంగల్
 
 మళ్లీ మార్చి 29 నుంచి...
 
మార్చి 15 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ మార్చి 29 నుంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పంచాంగ ంలో ముహూర్తాలు ఉన్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement