వరంగల్ టూరిజం | Warangal Tourism | Sakshi
Sakshi News home page

వరంగల్ టూరిజం

Published Sun, Sep 14 2014 3:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

వరంగల్ టూరిజం - Sakshi

వరంగల్ టూరిజం

  • సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్.. నేడు జిల్లా వేదికగా రూపకల్పన
  •  జిల్లాలోని చారిత్రక ప్రాంతాల సమస్త సమాచారం
  •  పర్యాటకులకు గైడ్‌గా నిలిచే ‘యాప్’
  •  ‘రాడన్‌సోల్’ ఆధ్వర్యంలో స్థానిక విద్యార్థుల డెవలపింగ్
  •  24 గంటల్లో అందుబాటులోకి...
  • సాక్షి, హన్మకొండ : సమాచార, సాంకేతిక రంగంలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లో ఏ సమాచారం కావాలన్నా... క్షణాల్లో తెలిసిపోతోంది. ఇప్పుడు చారిత్రక వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల వివరాలను తెలుపుతూ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై వరంగల్ టూరిజం పేరిట సరికొత్త అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. రాడన్‌సోల్ సంస్థకు చెందిన నిపుణుల ఆధ్వర్యంలో నగర విద్యార్థు లు ఆదివారం రూపొందించనున్నారు.
     
    ఫుల్ డిమాండ్

    ఆధునిక సమాజంలో స్మార్ట్‌ఫోన్ల విని యోగం పెరిగి పోయింది. అండ్రాయిడ్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, బ్లాక్ బెర్రీ వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌లపై స్మార్ట్‌ఫోన్లు పని చేస్తున్నాయి. వీటిలో వేల కొద్ది అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అయినా సరే.. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోజురోజుకూ వందల సంఖ్యలో కొత్త అప్లికేషన్లు పుట్టుకొస్తున్నాయి.

    గతంలో కంప్యూటర్ శిక్షణ సంస్థల తరహాలో స్మార్ట్‌ఫోన్లలో అప్లికేషన్ డెవలపింగ్‌కు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. అయితే... ద్వితీయ శ్రేణి నగరాల్లో స్మార్ట్ అప్లికేషన్ల డెవలపింగ్‌పై అవగాహన తక్కువ. ఈ నేపథ్యంలో వీటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో వరంగల్ విద్యార్థులతో వరంగల్ వేదికపై ఈ అప్లికేషన్‌ను సిద్ధం చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన రాడన్‌సోల్ సంస్థ ముందుకు వచ్చింది.

    ప్రమోషనల్ వర్క్‌లో భాగంగా ఆ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గతంలో ఈ సంస్థ రూపొందించిన అప్లికేషన్లలో ఐదు ప్రధానమైనవి. ఇవి ఇప్పటికే నాలుగు పాయింట్లకు పైగా రేటింగ్ సాధించాయి. ఈ అప్లికేషన్లను వినియోగదారులు వెయ్యి సార్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.  ముఖ్యంగా ఓఎస్‌ఐ లేయర్స్ (కంప్యూటర్ నెట్‌వర్క్స్),  ఫైనాన్షియల్ రేషియో అనే అప్లికేషన్లు 4.5 రేటింగ్‌తో పది వేల సార్లకు పైగా డౌన్‌లోడ్ అయ్యాయి.
     
    మేడిన్ వరంగల్

    వరంగల్ టూరిజం అప్లికేషన్ రూపకల్పన కోసం నగరంలో వివిధ విద్యాసంస్థలకు చెందిన 12 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. నక్కలగుట్టలోని సుప్రభ హోటల్ వేదికగా రాడన్‌సోల్ సంస్థకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో ఆదివారం వారు ఈ అప్లికేషన్‌ను రూపొందించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొనసాగనుంది. అప్లికేషన్ రూపకల్పన పూర్తికాగానే... దాన్ని గూగుల్ ప్రతినిధులకు పరిశీలన కోసం పంపించనున్నారు. ఆ తర్వాత 24 గంటల్లోపు ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
     
    పర్యాటకుల గైడ్...

    ప్రస్తుతం భద్రకాళి ఆలయ ‘యాప్’ తప్ప... వరంగల్ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆప్లికేషన్లు అందుబాటులో లేవు. ఆదివారం రూపొందించనున్న వరంగల్ టూరిజం యాప్‌లో నగరంలోని వేయిస్తంభాల గుడి, కీర్తితోరణాలు, ఖిలావరంగల్ కోట, జూపార్క్,  భద్రకాళి ఆలయం వంటి చారిత్రక ప్రాంతాలతోపాటు పాకాల, రామప్ప, లక్నవరం, గణపసముద్రం, ధర్మసాగర్ చెరువులు, ఏటూరునాగారం అభయారణ్యం, గోదావరి తీరప్రాంతాలకు సంబంధించిన సమాచారం పొందుపరచనున్నారు.

    ఆయూ ప్రాంతాలకు రైలు, రోడ్డుమార్గాల ద్వారా ఎలా చేరుకోవాలనేఅంశాన్ని కూడా జోడించనున్నారు. అదేవిధంగా... పర్యాటక ప్రాంతాల్లో బస, వసతి, భోజనం అందించే హోటళ్ల వివరాలను ఇందులో పొందుపరచనున్నారు. రానున్న రోజుల్లో ఈ యాప్ ద్వారా పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లు, బస్సులను రిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని సైతం కల్పించనున్నారు.
     
    యాప్‌ను డెవలప్ చేస్తున్నాం

    స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లు డెవలప్ చేయడంపై వరంగల్ నగర ప్రజలకు అవగాహన కల్పించేం దుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మొదటి సారిగా వరంగల్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాల వివరాలను తెలిపేలా వరంగల్ టూరి జం పేరుతో యాప్‌ను రూపొందిస్తున్నాం. ప్రయోగాత్మకంగా విద్యార్థులతో ఈ యాప్‌ను డెవలప్ చేస్తున్నాం.       
     - నుస్రత్, రాడన్ సోల్ సంస్థ ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement