పొలానికి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు | Water filled with tankers to crops | Sakshi
Sakshi News home page

పొలానికి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు

Published Fri, Feb 27 2015 9:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

పొలానికి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు - Sakshi

పొలానికి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు

వేములవాడ(కరీంనగర్): ఎక్కడైనా రైతులు పొలానికి నీళ్లు ఎలా పెడతారు ? బోరు సహాయంతోనో లేక బావిలోని నీటినో ఉపయోగిస్తారు. అయితే, ప్రస్తుత కరెంట్ కోతలతో విసుగు చెందిన ఒక రైతు ఏకంగా వాటర్ ట్యాంకర్‌తో పొలానికి నీటిని అందిస్తున్నాడు. ఈ సంఘటనను చూస్తేనే తెలుస్తుంది తెలంగాణలో కరెంట్ కష్టాలు ఎలా ఉన్నాయో. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం క్షేత్రాజపల్లి గ్రామంలో శుక్రవారం దర్శనమిచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన తాహెర్‌పాషా వేసవిలో పొలం సాగుచేశాడు.

అయితే, కరెంట్ కష్టాలతో పొలానికి నీరు సరిగా అందడంలేదు. ఈ స్థితిలో పాలుపోని రైతు ఎలాగైనా పొలానికి నీటిని అందించాలనుకున్నాడు. దీంతో ఒక వాటర్ ట్యాంకర్ సహాయంతో తన పొలానికి నీటిని అందిస్తున్నాడు. కరెంట్ కష్టాల నుంచి ఉపసమనం కోసం పొలానికి ట్యాంకర్‌తో నీటిని అందిస్తున్నానని వాపోయాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement