Water tankers
-
ఐటీ సిటీలో నీటి సంక్షోభం.. ప్రభుత్వంపై వెల్లువెత్తిన విమర్శలు
బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెంట్స్ అసోసియేషన్ల నుంచి రీసైకిల్ చేసిన లేదా శుద్ధి చేసిన నీరు వంటి వాటి కోసం ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషిస్తోంది. రోజుకు సుమారు 2600 నుంచి 2800 మిలియన్ లీటర్ల నీటిని బెంగళూరు ప్రజలు ఉపయోగిస్తున్నట్లు.. నీటి కొరత వల్ల నేడు 1500 మిలియన్ లీటర్ల కొరత ఏర్పడిందని సమాచారం. నీటి నిర్వహణ చర్యలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. గత వరం రోజుల నుంచి అధికార పక్షం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. నీటి సమస్యను తీర్చడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉండబోతున్నట్లు.. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1,193 వార్డులతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 7,082 గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కూడా తుమకూరు జిల్లా (746 గ్రామాలు) అగ్రస్థానంలో ఉంది. నీటి కొరత పెరుగుతున్న తరుణంలో ట్యాంకర్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గతంలో రూ.1000 నుంచి రూ. 1500 వరకు ఉన్న ట్యాంకర్ ధర ఇప్పుడు రూ. 2000కు చేరింది. అయితే ప్రభుత్వం కూడా కొత్త ధరలను ప్రకటించింది. ఈ ధరలకే వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది (కొత్త ధరలు GSTతో సహా ఉంటాయి). బెంగళూరులో వాటర్ ట్యాంకర్ రేట్లు 5 కిమీ పరిధిలో ట్యాంకర్ల ధరలు 6000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.600 8,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.700 12,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.1000 5 కిమీ కంటే ఎక్కువ పరిధిలో ట్యాంకర్ల ధరలు 6,000 లీటర్ల వాటర్ ట్యాంకర్ - రూ. 750 8,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.850 12,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.1200 -
బుక్ చేసిన 48 గంటల్లో వాటర్ ట్యాంకర్
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంకర్ నీళ్లకోసం గ్రేటర్ సిటీజనులు ఇక కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే అవస్థలు తీరనున్నాయి. ఇక నుంచి బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారులకు ట్యాంకర్ నీళ్లు సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించింది. గ్రేటర్‌వాసులకు ఈ వేసవిలో క‘న్నీటి’ కష్టాలు తీర్చేందుకు రూ.50 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక–2020 సిద్ధంచేసింది. నగరంలో మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని, అవసరం మేరకు మంచినీరు సరఫరా చేస్తామని జలమండలి భరోసానిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ వేసవి కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో డిమాండ్‌కు అనుగుణంగా నీటి సరఫరా చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వెయ్యి ట్యాంకర్లకు తోడు అదనంగా మరో 230 అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నగరంలో అందుబాటులో ఉన్న 110 ట్యాంకర్ నీటి ఫిల్లింగ్ పాయింట్లకు అదనంగా మరో 23 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. విద్యుత్ కోతలు అధికంగాఉండే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద మినీ జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పర్యవేక్షణకు పదిమంది ప్రత్యేకాధికారులు ఈ వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరా పర్యవేక్షణకు 10 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు ఎండీ తెలిపారు. వీరు ప్రతిరోజూ ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి, మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే అక్కడికక్కడే నల్లాలు, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమస్యత్మాక ప్రాంతాల్లో జరుగుతున్న మంచినీటి సరఫరా, లోప్రెజర్, ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి 100 మందితో థర్డ్ పార్టీ తనిఖీలు చేపడతామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నీటి సమస్య అధికంగా ఉండే లోప్రెషర్, టేల్ ఎండ్ ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్ వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదో తనిఖీ చేయాలని సూచించారు. తక్షణం వాటికి రిపేర్లు పూర్తిచేయాలని అదేశించారు. సమస్యత్మాక ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న స్టాటిక్ ట్యాంకులకు మరమ్మతులు చేయాలని, అవసరం ఉన్న చోట నూతనంగా స్టాటిక్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలుషిత జలాల సరఫరా, నీరు వృథాగా పోతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన చోట వాల్వులు, జంక్షన్ల పనులు పూర్తి చేయాలని ఎండీ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా బోర్లు, ట్యాంకుల మరమ్మతు పనులు పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్‌లతో పాటు సంబంధిత సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు. -
గ్రేటర్ గొంతెండుతోంది..!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ శివార్లలోని పలు ప్రాంతాల్లో బోరుబావులు చుక్కనీరు లేక బావురుమంటుండటంతో జలమండలి నల్లా నీళ్లు ఏమూలకూ సరిపోవడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్నీటి కష్టాలు నగరవాసికి పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు ఇంటి అద్దెలకు దాదాపు సమానమైన మొత్తాన్ని ట్యాంకర్ నీళ్ల కొనుగోలుకు వెచ్చించి జేబులు గుల్లచేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 460.88 మిలియన్‌గ్యాలన్ల కృష్ణా, గోదావరి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాలను సరఫరా చేసినా నీటి డిమాండ్ 560 మిలియన్ గ్యాలన్ల మేర ఉంది. సుమారు వంద ఎంజీడీల నీటికి కొరత ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో కన్నీటి కష్టాలు దర్శనమిస్తున్నాయి. జలమండలి ప్రస్తుతం సరఫరా చేస్తున్న 460.88 మిలియన్ గ్యాలన్ల నీటిలోనూ 40 శాతం మేర సరఫరా, చౌర్యం తదితర నష్టాల కారణంగా వాస్తవ సరఫరా 276 మిలియన్గ్యాలన్లు మించడంలేదు. అంటే కోటికి పైగా జనాభాతో అలరారుతోన్న సిటీలో ప్రతీవ్యక్తికి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా. ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఇదే దుస్థితి. ప్రైవేటు ట్యాంకర్ నీళ్లు (ఐదు వేల లీటర్ల నీరు)కు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రూ.2–5 వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. పలు గేటెడ్‌కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల సముదాయాలున్న అపార్ట్మెంట్లలో ట్యాంకర్ నీళ్ల కొనుగోలుకు నెలకు లక్షల్లో వ్యయం చేస్తుండడం గమనార్హం. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏడాదిగా తీవ్ర వర్షాబావ పరిస్థితులు, జలమండలి అరకొరగా నీటిని సరఫరా చేస్తుండడంతో జనం బాధలు వర్ణనాతీతంగా మారాయి. వేలు చేల్లించినా ప్రైవేట్ నీటి ట్యాంకర్లు దొరకని దుస్థితి నెలకొంది. ఐటీ కారిడార్‌లో బస్తీలకు రెండు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. అపార్ట్మెంట్లకు, వాణిజ్య నల్లా కనెక్షన్లకు భారీగా నీటి కోత విధిస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో నివాసం ఉండే వారు ట్యాంకర్ నీళ్లకు వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాలలో 1500 అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు కనిపించడం లేదు. కొండాపూర్‌లోని గౌతమీ ఎన్క్లేవ్ ఇంకుడు గుంతలు ఎన్నో ఏర్పాటు చేశారు. గత సంవత్సరం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. గౌతమీ ఎన్‌క్లేవ్‌లో దాదాపు 60 అపార్ట్మెంట్లు ఉన్నాయి. రోజు 5000 లీటర్ల ట్యాంకర్లు 100కు పైగానే కొనుగోలుచేస్తున్నట్లు గౌతమీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసిసియేషన్ అధ్యక్షులు యలమంచలి శ్రీధర్ తెలిపారు. 5000 లీటర్ల ట్యాంకర్‌కు 2 వేలపైనా, 10 వేల ట్యాంకర్‌కు 4వేలకు పైన వసూలు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో 5000 లీటర్ల ట్యాంకర్‌కు 3 వేలు, 10 వేల ట్యాంకర్‌కు 6 వేలు వసూలు చేస్తున్నారు. సీజన్లో రూ.600 ఉండే 500 లీటర్ల ట్యాంకర్ ఖరీదు రెండు వేలకు పైనే ఉందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అరకొర నీటి సరఫరా గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు వెయ్యి కుంటుంబాలు నివాసం ఉంటాయి. ప్రతి రోజు జలమండలి 1400 కేఎల్ నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఈ నెల 13న 407.59 కెఎల్, 14న 281.17 కెఎల్, 15న 140.23 కెఎల్, 16న 208.17 కెఎల్, 17న 80.26 కెఎల్, 18న 408.93 కెఎల్, 19న కేవలం 8.33కెఎల్ నీటిని సరఫరా చేసింది. అవసరం మేరకు నీటి సరఫరా సరగకపోవడంతో స్థానికులు జలమండలి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్లో అక్రమ నీటి వ్యాపారం నిర్వహిస్తున్న బోర్లను రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. దీంతో పటాన్ చెరువు శివారు గ్రామాలు, శంకర్పల్లి మండలంలోని గ్రామాలు, తెల్లాపూర్ నుంచి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దూరం నుంచి రావడంతో ఖర్చు పెరుగుతోందని ట్యాంకర్ నిర్వాహకులు చెబుతున్నారు. కూకట్పల్లి ప్రాంతంలో.. కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో రెండు ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీలలో ఇదే దుస్థితి నెలకొంది. కేపీహెచ్‌బీకాలనీలోని మలేషియాటౌన్షిప్లో తీవ్ర నీటి ఎద్దడి. ఈ ఏడాది మార్చి–జూన్ వరకు జలమండలికి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించినప్పటికీ సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్చినెలలోనే జలమండలికి తాగునీటి కోసం 6.7లక్షలు బిల్లు రూపంలో చెల్లించగా, బయటి నుంచి సుమారు 285 ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసినందుకు రూ.5.8లక్షలు చెల్లించినట్లు స్థానికులు తెలిపారు. నీటి సరఫరాలో విఫలం 15 రోజులకోసారి నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. 40 ఫ్లాట్లు ఉన్న మా అపార్ట్‌మెంట్‌కు నెలకు 436కెఎల్ సరఫరా చేయాల్సి ఉండగా 100 కెఎల్ కూడా సరఫరా చేయడం లేదు. బోర్లన్నీ ఎండిపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అత్యవసర సమయంలో ట్యాంకర్ యజమానులు డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారు. – కిరణ్, ప్రీస్టైన్ అపార్ట్మెంట్ గౌతమి ఎన్క్లేవ్ జలమండలి నీరు 60శాతం తగ్గకుండా సరఫరా చేయాలి జలమండలితో తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోయినా కనీసం 60శాతానికి తగ్గకుండా సరఫరా చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా కేవలం 30 నుంచి 40శాతం నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో మేము లక్షలు వెచ్చించి బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలుచేయాల్సిన దుస్తితి తలెత్తింది. – శ్రీకాంత్‌రెడ్డి, ఇందూ ఫార్చ్యూన్ఫీల్డ్స్ గార్డెనీయా అధ్యక్షుడు -
ప్రజలంటే అలుసే..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిధుల కొరతలేదని తాగునీటి అవసరాల కోసం ఎన్ని కోట్లైనా ఇస్తామని చెప్పిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మాటలు నీటిమూటలుగా మారాయి. ప్రభుత్వం సకాలంలో నిధుల్వివక పోవడంతో గ్రామపంచాయతీల్లో తాగునీటి సరఫరా సక్రమంగా సాగడంలేదు. 13 నెలలకు సంబంధించి రూ. 60.92 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. డబ్బులివ్వక పోతే నీటి సరఫరా నిలిపి వేస్తామని సర్పంచ్‌లతో పాటు ట్యాంకర్ యజమానులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే కొందరు నీటి తరలింపు నిలిపి వేయడంతో నీటి కొరత ఉన్న గ్రామాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు. పగబట్టిన వాతావరణం తీవ్ర వర్షాభావం వల్ల జిల్లాలో తాగునీటి కష్టాలు పెరిగాయి. చాలా ప్రాంతాలకు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం నీటిసరఫరా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, కందుకూరు, దర్శి తదితర ప్రాంతాల్లోని దాదాపు 700 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఒట్టిపోవడంతో పాటు తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం 400 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టింది. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లు మరికొన్ని గ్రామాల్లో అధికారపార్టీకి చెందిన స్థానిక నేతలు నీటిని సరఫరా చేశారు. లక్షలాది ట్రిప్పులు 2017 ఏప్రిల్‌లో 92 వేల ట్రిప్పులు, మేలో 1.23 లక్షలు, జూన్‌లో 1.27 లక్షలు, జులైలో 1.30 లక్షలు, ఆగస్టులో 1.17 లక్షలు, సెప్టెంబర్‌లో 64 వేలు, అక్టోబర్‌లో 40 వేలు, నవంబర్‌లో 24 వేలు, డిసెంబర్లో 27 వేల ట్రిప్పుల నీటిని సరఫరా చేశారు. వీటికి సంబంధించి రూ. 39.92 కోట్లను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ద్వారా గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సి ఉంది. ఇక 2018 ఏడాదికి సంబధించి జనవరిలో 142 గ్రామాల పరిధిలో రోజుకు 1214 ట్రిప్పుల ప్రకారం నెలకు 36,420 ట్రిప్పులు, ఫిబ్రవరిలో 178 గ్రామాల పరిధిలో నెలకు 47,730, మార్చిలో 247 గ్రామాల పరిధిలో నెలకు 74,760, ఏప్రిల్ నెలలో 312 గ్రామాల పరిధిలో నెలకు 99,240, మే నెలలో 350 గ్రామాల పరిధిలో రోజుకు 3700 లెక్కన నెలకు 1.12 లక్షల ట్రిప్పులను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నెలకు రూ. 4 కోట్ల చొప్పున ఖర్చు కాగా మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల్లో రూ. 13 కోట్లు నీటి సరఫరాకు ఖర్చయింది. ఈ లెక్కన ఈ ఏడాది అయిదు నెలలకు రూ. 21 కోటి అయింది. అంటే మొత్తం 13 నెలల్లో తాగునీటి సరఫరా ఖర్చు రూ. 60.92 కోట్లు. ఈ మొత్తంలో ప్రభుత్వం ఇప్పటికి ఒక్క పైసా చెల్లించలేదు. ఏడాదిగా బిల్లులు రాకపోవడంతో తాగునీటి సరఫరా ఇబ్బందిగా మారింది. పాత బిల్లులు ఇస్తేనే నీరు సరఫరా చేస్తామని పలువురు సర్పంచ్‌లు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో నీటి సరఫరాను నిలిపి వేసినట్లు తెలిసింది. త్వరలోనే బిల్లులు వస్తాయని గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం బిల్లులు మంజూరు చేయాలని సర్పంచ్ లు డిమాండ్ చేస్తున్నారు. నిధులు వచ్చాయి తాగు నీటిసరఫరాకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ. 39.92 కోట్లు బిల్లులు ఇవ్వాలి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సరఫరాకు సంబంధించిన బిల్లులు సైతం ఇవ్వాల్సి ఉంది. గత ఏడాదికి సంబంధించిన రూ. 39.92 కోట్ల నిధులు వచ్చాయి. బిల్లులు తెప్పించుకున్నాం. త్వరలోనే ఈ మొత్తాన్ని చెల్లిస్తాం. ఈ ఏడాది నీటి సరఫరా బిల్లులు తర్వాత ఇస్తాం. – మహేష్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారి -
హరిత‘దైన్యం’
సాక్షి, సిద్దిపేట: మూడో విడత హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా 492 మంది హరిత సైనికులను నియమించారు. సైకిళ్లను సైతం అందచేశారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను.. రోజూ మూడు కిలోమీటర్ల మేర సైకిల్‌పై తిరిగి పర్యవేక్షించాలి. మొక్క ఎదుగుదలను పరిశీలించడం, కలుపు తీసి కంచెవేయడం, పాదులు తీయడం, ట్రీగార్డుపెట్టడం, మొక్క చనిపోతే దాని స్థానంలో కొత్తది నాటడం.. వీరి విధులు. ఈ పని చేసినందుకు రోజుకు రూ.194 చొప్పున ఉపాధి హామీ పథకం కింద చెల్లిస్తారు. ఉపాధి హామీ నిబంధన ప్రకారం ఒక జాబ్ కార్డుకు ఏడాదికి వంద రోజులే పని కల్పిస్తారు. హరిత సైనికులు నెలలో 24 రోజులు పనిచేసినా.. నాలుగు నెలల్లోనే అతని వంద రోజులు పని పూర్తవువుతుంది. దీంతో అతనికి డబ్బులు చెల్లింపునకు నిబంధనలు అడ్డు వస్తాయి. దీంతో అతని పనిదినాలు పూర్తయ్యాక మరొకరి కార్డుపై పనిచేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నిజమైన కార్డుదారునికి, హరిత సైనికుడికి మధ్య డబ్బుల విషయంలో ఘర్షణలు పరిపాటి అయ్యాయి. నిజానికి ఒక సైనికుడు రోజూ 400 మొక్కలు పరిరక్షించాలి. కానీ, 800–1,000 మొక్కల పర్యవేక్షణ అతనికి అప్పగిస్తున్నారు. కూలీ మాత్రం 400 మొక్కలకే ఇస్తున్నారు. మిగిలిన మొక్కలు చూసినందుకు అదనపు డబ్బులు ఇవ్వడం లేదు. జిల్లాలో ఉపాధి హామీ పథకం నుంచి హరితహారానికి కేటాయించిన డబ్బుల్లో రూ.2.5 కోట్లు బకాయిలు పడగా.. ఇందులో హరిత సైనికుల బకాయిలు కోటి రూపాయల వరకు ఉన్నాయి. దీంతో పలువురు హరిత సైనికులు మొక్కల సంరక్షణను పట్టించుకోవడం లేదు. ‘నీళ్లొదిలిన’ ట్యాంకర్లు హరిత సైనికుల సంగతిలా ఉంటే, జిల్లాలోని 399 గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు 325 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. నీరు పోసినందుకు మొక్కకు 96 పైసలు చొప్పున ఇస్తారు. ప్రతీ మొక్కకు వారం, లేదా 10 రోజులకోసారి 10 లీటర్ల చొప్పున నీళ్లు పెట్టాలి. ఈ లెక్కన ట్యాంకర్‌కు ప్రభుత్వం రూ.384 చొప్పున లెక్కకట్టి చెల్లిస్తోంది. ట్యాంకరు సామర్థ్యం 5 వేల లీటర్లు. మొక్కలకు నీళ్లు పెట్టడంలో ఎక్కువ తక్కువలు ఉంటాయని, కాబట్టి ట్యాంకర్‌కు రూ.480 చొప్పున ఇస్తే తప్ప గిట్టుబాటు కాదని వీరంటున్నారు. పెరిగిన డీజిల్, డ్రైవర్, కూలీ ఖర్చులతో రూ.384కి తాము నీళ్లు పోయలేమని అంటున్నారు. అదనపు డబ్బులు ఇవ్వకపోతే పనిచేయలేమని తేల్చి చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను కాపాడుకోవడం జిల్లా యంతాంగానికి సవాల్ కానుంది. ముంచుకొస్తున్న వేసవి మూడో విడత హరితహారం కింద 2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ఇందుకు అనుగుణంగా అటవీ శాఖ పరిధిలోని 105 నర్సరీల్లో 1.60 కోట్ల మొక్కలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని 43 నర్సరీల్లో 33 లక్షల టేకు మొక్కలు పెంచారు. మరికొన్ని మొక్కల్ని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రారంభంలో కురిసిన వర్షాలకు మొక్కలు నాటుకొని ఏపుగా పెరిగాయి. చలికాలంలోనూ వాటి పరిరక్షణ విజయవంతమైంది. నాటిన వాటిలో 90 శాతానికి పైగా బతికాయి. అసలైన సవాల్ ఇప్పుడే ఎదురైంది. ఒకపక్క హరిత సైనికులు, ఇంకోపక్క వాటర్ ట్యాంకర్ల యజమానుల సహాయ నిరాకరణ.. మరోపక్క ముదురుతున్న ఎండలు అధికారులను హడలెత్తిస్తున్నాయి. ఈ వేసవిలో మొక్కల సంరక్షణపై యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. పైసా ఇవ్వలేదు నన్ను హరిత సైనికునిగా నియమించి, సైకిల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైసా ఇవ్వలేదు. మూడు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను రోజూ సంరక్షిస్తున్నా. మొక్కలకు దిక్కవుతున్న మాకు ఏ దిక్కూ లేకుండాపోయింది. పైసలు అసలిస్తరో యియ్యరో అర్థం కావట్లేదు. – అస్క స్వామి, హరిత సైనికుడు, మిరుదొడ్డి రెండు నెలల జీతమే వచ్చింది ఆరు నెలలుగా పనిచేస్తున్నా. రెండు నెలల జీతమే ఇచ్చిండ్రు. రోజుకు రూ.194 ఇస్తామని చెబితే సైకిల్‌పై తిరుగుతూ మొక్కలకు పాదులు తీసి నీళ్లు పోత్తన్న. ఉపాధి హామీలో వంద రోజులు నిండిపోయిన్నై. మిగతా జీతం ఎట్ల ఇత్తరో ఏమో? పనులు చేయాలని చెబుతున్నరు. పనైతే చేత్తన్న. జీతం రాకుంటే మండల ఆఫీసుల పోయి కూర్చుంట. ఈ పని చేయబట్టి మల్లా ఏ పనీ చేయరాకుండా కావట్టే. నెలనెలా జీతమిత్తె జర ఇల్లు గడుసు. – గాలిపెల్లి శంకర్, పొట్లపల్లి నీటి బిల్లులు ఇస్తలేరు ప్రతి నెలా నాలుగైదుసార్లు మొక్కలకు ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నాం. ఒక్కో ట్రిప్పునకు రూ.500 చెల్లిస్తామని సార్లు చెప్పిండ్రు. ఇప్పటి వరకు రూ.60 వేల బిల్లయ్యింది. నాకు రూ.23 వేలు మాత్రమే చెల్లించారు. మిగిలిన పైసల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఇలా అయితే నీళ్లు బంద్ చేసుడే.. – తోట భూపాల్‌రెడ్డి, హరితహారం వాటర్ ట్యాంకర్ యజమాని, మిరుదొడ్డి మొక్కల రక్షణకు ప్రణాళిక హరితహారం 3వ విడత అవెన్యూ ప్లాంట్స్ సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. హరిత సైనికుల, వాటర్ ట్యాంకర్ బకాయిలు త్వరలో చెల్లిస్తాం. పాదులు పెద్దగా ఉండటంతో నీళ్లు ఎక్కువ పడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి ట్యాంకర్ల వారికి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. – స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
నీటి తండ్లాట షూరూ...
నార్నూర్ : వేసవి కాలం ప్రారంభానికి ముందే గిరిజన గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి నెలకొంది. తాగు నీటి సౌకర్యం లేక బిందేడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నీటి సమస్యను పరిష్కారించాలని 40 ఏళ్లుగా వెడుకుంటున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారని సుంగాపూర్ తండా, కొలాంగూడ, గోండుగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు వాపోతున్నారు. మూడు గుడాలకు కలిపి కొలాంగూడలో ఒక్కటే చేతిపంపు ఉంది. గత 40 ఏళ్లుగా నీటి సమస్య ఉన్నప్పటికీ 30 ఏళ్లుగా ఒక చేతి పంపు నీటిని మూడు గూడాల గిరిజనులు వాడుకుంటున్నారు. ఒక చేతి పంపు మీద దాదాపు 500 కుటుంబాలు ఆధారపడాల్సి వస్తోంది. నీటి కోసం తప్పని గోస... చోర్గావ్ గ్రామ పంచాయతీ పరిధిలోని సుంగాపూర్ తండా 200, కొలాంగూడలో 150, గోండుగూడలో 160 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మూడు గూడాలకు నీటి సౌకర్యం లేదు. కొలాంగూడలోని ఒక చేతి పంపు వద్ద బారులు తీరి నీటిని పట్టుకుంటారు. బిందేడు నీటి కోసం గంట ఆగాల్సి వస్తొందని గిరిజన మహిళలంటున్నారు. నీటి కోసం గోడవలు సైతం అవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య తీర్చాలని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పినా ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం పైపులైన్ పనులు కూడా మొదలపెట్టలేదని గిరిజనులంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి మూడు గూడాలకు తాగు నీటి సౌకర్యం కల్పించాలని గిరిజన గ్రామస్తులు కోరుతున్నారు. చాలా గోసైతాంది... మాకు తాగటానికి నీళ్లు లేవు. నీటి కోసం చాలా గోసైతాంది. రోజు బిందే నీటి కోసం గంట ఆగాల్సి వస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీలు పట్టించుకోవాలి. మా ఊళ్లకు నీటి సౌకర్యాన్ని కల్పించాలి. మా గోసను తీర్చాలి. నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేయాలి. – కొడప నాగు, సుంగాపూర్ ఒక చేతిపంపుతో ఇబ్బంది.. మూడు గూడాలకు ఒక చేతి పంపు మాత్రమే ఉంది. తాగడానికి స్నానానికి ఇక్కడి నుంచే నీటిని తీసుకువెళ్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిందేలతో బారులు తీరాల్సి వస్తోంది. బిందేడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. – అయ్యుబాయి, కొలాంగూడ నీటి సమస్య తీర్చాలి... గత 40 ఏళ్లుగా నీటి కోసం ఆరిగోస పడుతూనే ఉన్నాం. అధికారులు, జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎండకాలంలో ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్ల ద్వారా నీటి సరపరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. శాశ్వతంగా పరిష్కరించాలి. – గణేష్, గిరిజన నాయకుడు -
కెమెరాకు చిక్కిన ఎమ్మెల్యే అనుచరుల నిర్వాకం
గిద్దలూరు : అధికారంలో తమ ప్రభుత్వమే... దీంతో తాము ఏం చేసినా అడిగేవారు ఉండరనే ధీమా. వెరసి అవకాశం వస్తే రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారనే విషయంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనుచరులు మరోసారి నిరూపిస్తున్నారు. స్థానిక ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన మంచి నీటిని ఎమ్మెల్యే అనుచరులు ట్యాంకర్ల ద్వారా పక్క దారి పట్టిస్తున్న వైనం కెమెరా కంటికి చిక్కింది. వ్యక్తిగతంగా తనకు చెందిన ట్యాంకర్లను ప్రజలకు తన స్వంత డబ్బుతో సరఫరా చేస్తున్నట్టు జనాన్ని మభ్యపెట్టడమే కాక ఆ వాహనాలపై నిబంధనలకు విరుద్ధంగా తాటికాయంత అక్షరాలతో గుమ్మడికాయ అంత ఫోటో వేసుకుని మరీ తిరుగుతున్న వైనం చూసి స్థానికులు ఈసడించుకుంటున్నారు. దానికి తోడు సరఫరా చేయడానికి ఉద్దేశించిన మంచి నీటిని స్వార్థ ప్రయోజనాల కోసం స్థానికంగా పేరున్న ఓ ప్రముఖ రెస్టారెంట్ కు ఇవే ట్యాంకర్ల ద్వారా వ్యాపారం చేయటం కూడా కెమెరాకు చిక్కింది. ఇలా సామాన్యులకు అందాల్సిన కనీస హక్కు అయినా మంచి నీటిని ఇలా లాభాపేక్ష కోసం అమ్ముకోవడం నీచమని స్థానికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. స్థానికులు కనీస తాగునీటి అవసరాలకు కూడా నీరు లేక అలమటిస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఇలా బజారులో అమ్ముకోవడంపై భగ్గుమంటున్నారు. ప్రజల క్షేమం పట్టని ఇలాంటి నాయకులు ఉంటే క్షామం తప్పదని మరోసారి అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు రుజువు చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. మరి సదరు ఎమ్మెల్యే దీనికి ఏం సమాధానం ఇస్తారో చూడాలి. -
నీటిఎద్దడిని నివారించాలి
⇒ ట్యాంకర్లు, బోర్లు అద్దెకు తీసుకుని సరఫరా చేయాలి ⇒ మండల అధికారులతో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ సమీక్ష నల్లగొండ : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలు నాయక్ తెలిపారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధి కారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా అధిగమించామని, ఈ ఏడాది కూడా అదే విధంగా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఏయే గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గతేడాది అద్దెకు తీసుకున్న బోర్ల పేమెంట్, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన వారికి చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి త్వరితగతిన చెల్లిస్తే ఈ ఏడాది బోర్లు అద్దెకు తీసుకోవడానికి, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు బోర్లు అద్దెకు తీసుకుని లేదా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. ఐకేపీ కొనుగోలు కేం ద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు పాటించా లన్నారు. ధాన్యం రవాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ఈ పాపారావు పాల్గొన్నారు. -
ఇరుకుపోతున్న ట్యాంకర్లు
హిందూపురం అర్బన్ : పట్టణంలో పరిమితి మించి ఇంటి నిర్మాణాలు జరిగిపోతుండటంతో వీధులన్నీ ఇరుకుగా మారిపోతున్నాయి. దీనికి తోడు ప్రైవేట్ నీటి ట్యాంకర్ల నిర్వాహకులు వ్యాపారం కోసం సందుల్లో కూడా వెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి ట్యాంకర్లు సందుల్లోని రోడ్లలో ఇరుక్కుపోతున్నాయి. ముక్కిడిపేట, ఆజాద్పేట,హస్నాబాద్, ముద్డిరెడ్డిపల్లి, శ్రీకంఠపురం ఏరియాల్లోని వీధుల్లో ట్యాంకర్లు వస్తే రాకపోకలు స్తంభించాల్సిందే. -
ప్ర‘జల'రథాలు
♦ ప్ర‘జల’ సాక్షిగా ముందడుగు ♦ నిన్న చలివేంద్రాలు.. నేడు వాటర్ ట్యాంకర్ల ♦ ద్వారా నీరు గుండ్లమాచునూర్ ♦ గ్రామానికి నీటి సరఫరా ♦ పచ్చజెండా ఊపి ట్యాంకర్లను ప్రారంభించిన కలెక్టర్ నిన్న చలివేంద్రాల ద్వారా బాటసారులకు బాసట.. నేడు వాటర్ ట్యాంకర్ల ద్వారా.. నీటి కోసం తల్లడిల్లుతున్న పల్లెలకు ఊరట.. ప్ర‘జల’ మస్యలను ప్రస్తావించడమేకాదు.. పరిష్కరించడంలోనూ ‘సాక్షి’ భాగస్వామి అవుతోంది.. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు తండ్లాడుతున్న వేళ.. అక్షరం.. ‘నీటి’బద్ధమైంది. కరువు నేలపై ప్రజల గొంతు తడిపేందుకు ‘జల’రథమై కదులుతూ.. అమృతధారలు కురిపిస్తోంది.. ఎండుతున్న గొంతులకు ‘జల’జీవాలనిస్తూ.. దాహార్తి తీరుస్తూ.. ప్ర‘జల’ సాక్షిగా ముందడుగు వేస్తోంది... మంగళవారం హత్నూర మండలం గుండ్లమాచునూర్‌లో ‘సాక్షి’ చేపట్టిన నీటి సరఫరా కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. విశ్వసనీయత పెరుగుతుంది సేవా కార్యక్రమాలతో ‘సాక్షి’పై ప్రజల్లో ఇంకా విశ్వసనీయత పెరుగుతుంది. నీటిఎద్దడి సమయంలో పత్రిక చేసిన సాయం అభినందనీయం. ప్రభుత్వపరంగా జిల్లా లోని వెయ్యి గ్రామాల్లో బోర్లు అద్దెకు తీసుకొని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకాధికారిని నియమించాం. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. - రోనాల్డ్‌రాస్, కలెక్టర్ హత్నూర/నర్సాపూర్: నీళ్ల కోసం నోళ్లు తెరిచిన ఆ పల్లెపై అమృతధారల కురిశాయి. నిన్నటి వరకు ప్రజల మదిని తొలచిన కన్నీటి వ్యథ తీరిపోయింది. ఁసాక్షి* చూపిన చొరవ, కోవలెంట్, హానర్ పరిశ్రమ సహకారంతో సమస్య గట్టెక్కింది. ఒక్కరోజు, రెండు రోజుల కార్యక్రమం కాదిది. ఏకంగా వర్షాలు పడే వరకు నిత్యం లక్ష లీటర్ల నీటి పంపిణీ జరగనుంది. మంగళవారం ప్రారంభమైన ‘జలధార’పై స్పెషల్ స్టోరీ... హత్నూర మండలం గుండ్లమాచునూర్, మదిర గ్రామం బొక్కలగూడెంలో 3,500 పైగా జనాభా ఉన్నారు. వరుస కరువులు పల్లెపై నీటి కష్టాలను కుమ్మరించాయి. పాతాళగంగను పైకి తెచ్చేందుకు గ్రామస్తులు విశ్వప్రయత్నాలు చేశారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో మొత్తం 26 బోర్లు వేయించారు. అయినా వాళ్ల గొంతుల తడి ఆరలేదు. ఈక్రమంలో గుండ్లమూచునూర్ జల కష్టాలు ‘సాక్షి’ని కదిలించాయి. ప్రజల జలగోసకు పరిష్కారం చూపించే దిశగా ముందడుగు వేసింది. గ్రామ శివార్లలోని కోవలెంట్, హానర్ పరిశ్రమల హెచ్ఆర్ మేనేజర్లు మోహన్‌రావు, సుభాష్‌రెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి కలిసి.. ప్రజల ఇబ్బందులు వివరించారు. ‘సాయం చేయండి, సాక్షి మీకు తోడుగా ఉంటుంది’అని హామీ ఇచ్చారు. దీంతో పరిశ్రమలు సుమారు లక్ష లీటర్ల నీటిని నిత్యం ట్యాంకర్ల ద్వారా అందించేందుకు అంగీకరించారు. వర్షాలు పడేంత వరకు ఈ బృహత్కార్యం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. సంప్‌హౌస్ ద్వారా సరఫరా జలధార పథకాన్ని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ మంగళవారం ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు రెండు ట్యాంకర్లు ఊరి పొలిమేర్లకు చేరుకున్నాయి. ప్రజలకు నేరుగా నీళ్లు అందిస్తే వృథా అవుతాయని భావించిన సర్పంచ్ ఈశ్వరమ్మ నర్సింహులు, ఎంపీటీసీ లావణ్య కృష్ణ, ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, హానర్.. కోవలెంట్ పరిశ్రమల హెచ్ఆర్ మేనేజర్లు సుభాష్‌రెడ్డి, మోహన్‌రావు, వార్డుసభ్యులు ఓ నిర్ణయం తీసుకున్నారు. శివారులోని సంప్‌హౌస్‌లో నీళ్లు నింపి అక్కడి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు ఆపై నల్లాల ద్వారా నీరు సరఫరా చేయాలని భావించారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్తును అందించేందుకు హానర్ పరిశ్రమ ముందుకొచ్చింది. దీంతో ఊరు మొత్తం నీళ్లు సరఫరా అయ్యాయి. తమ కష్టాలు తీర్చిన ‘సాక్షి’కి, కోవలెంట్, హానర్ పరిశ్రమలకు ఊరి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
ట్యాంకర్లకు జీపీఎస్
సాక్షి, హైదరాబాద్: పేదల గొంతు తడపాల్సిన మంచినీటి ట్యాంకర్లు దారి తప్పుతున్న వైనంపై ‘పెద్దలకే నీళ్లు’ పేరుతో ‘సాక్షి’ ప్రధాన సంచికలో, ‘‘అవి‘నీటి’ వ్యాపారం’’ పేరుతో హైదరాబాద్ టాబ్లాయిడ్లో శనివారం ప్రచురించిన కథనాలపై జలమండలి ఎండీ దానకిశోర్ స్పందించారు. దారి తప్పుతున్న ట్యాంకర్లకు తక్షణమే జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటి జాడను పసిగట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. శనివారం నగరంలో విస్తృతంగా పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేశారు. మంచినీటి సరఫరా, సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. ట్యాంకర్లకు డబ్బులు వసూలు చేయడంపై ఆరా తీశారు. ట్యాంకర్ల ద్వారా నీరు పొందిన కొందరు వినియోగదారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జీపీఎస్‌తో అక్రమార్కుల ఆటకట్టు మంచినీళ్లు లభించక గొంతెండుతున్న ప్రజల బాధలను తెలుసుకొనేందుకు దానకిశోర్ మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా తదితర ప్రాంతా ల్లో పర్యటించారు. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. దారి తప్పుతున్న ట్యాంకర్ల జాబితాను సిద్ధం చేయాలని నిఘా అధికారులను ఆదేశించారు. అక్రమంగా తరలుతున్న ట్యాంకర్లను నియంత్రించేందుకు జీపీఎస్ ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇక నియంత్రణ ఇలా: జీపీఎస్ ద్వారా వాటర్ ట్యాంకర్ల కదలికలను కచ్చితంగా అంచనా వేస్తారు. ప్రజల అవసరాల మేరకు ట్రిప్పులు పెంచుతారు. జలమండలితో పాటు, జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్లను సైతం జీపీఎస్ పరిధిలోకి తెస్తారు. స్మార్ట్ కార్డు ఉన్న ట్యాంకర్లు మాత్రమే జలమండలి నుంచి నీటిని చేరవేయాలి. ప్రస్తుతం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుండగా, ఇక నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అందజేయాలని ఎండీ సూచించారు. -
మా దాహం తీర్చండి మహాప్రభో!
లాతూర్(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని మాసుర్ది, లాతూరులో భయంకరమైన కరువు సంభవించింది. త్రాగునీరు దొరకపోవడంతో అక్కడి గ్రామాల్లోని జనం అల్లాడిపోతున్నారు. కరువు కారణంగా పంట పోలాలు, కాలువలు, చెరువుల్లో నీరు ఎండిపోయి బీటలు వారిపోతున్నాయి. 20 కిలోమీటర్లు వెళ్తేనేగానీ త్రాగునీరు దొరకని పరిస్థితి నెలకొనడంతో లాతూరులో నివసించే జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీళ్ల కొరత కారణంగా కొన్నిచోట్ల మహారాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. అంతేకాక నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు రైళ్ల ద్వారా మంచినీరును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్కడి ప్రజలు తమకు సాధ్యమైనంత తొందరగా త్రాగునీటిని సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు వాటర్ ట్యాంకర్లతో త్రాగునీటిని కరువు ప్రాంతాల్లో అందించే చర్యలు తీసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక్కరోజు వాటర్ ట్యాంకర్ రాకపోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. వాటర్ ట్యాంక్ రాకపోతే నీటిని అప్పుగా తీసుకునైనా సరే తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. లాతూరుకు వాటర్ ట్యాంకర్ రాగానే అక్కడి జనమంతా బారులు తీరి నీళ్ల కోసం అగచాట్లు పడుతున్నారు. ఈ వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడిన గ్రామస్తులు నీరు తెచ్చే దాకా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ట్యాంకర్లు రాకపోతే చేసేది ఏమిలేక కొన్ని మైళ్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంకరమైన కరువు దాపరించడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో కొందరు గ్రామస్తులు ఊరు వదిలిపోతున్నారు. -
తడారుతున్న గొంతులు
వరుణుడు ముఖం చాటేశాడు. చినుకు నేలరాలడం గగనమైంది. వంకలు, వాగులు, కుంటలు..ఇలా ఎక్కడా చుక్కనీరు లేదు. బోర్లన్నీ బావురుమంటున్నాయి. పంటల సాగు పూర్తిగా పడకేసింది. కనీసం తాగేందుకూ గుక్కెడు నీరు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెసీమల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరిగ్గా 20 రోజుల కిందట జిల్లాలో 220 గ్రామాలకు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేవారు. తాజాగా ఈ సంఖ్య 266కు చేరింది. జిల్లాలో తాగునీటి సమస్య ఎంత జఠిలంగా ఉందనేందుకు ఈ లెక్కలే నిదర్శనం. - జిల్లాలో గుక్కెడు తాగునీరూ కరువే - వరుణుడి జాడ లేక అడుగంటిన భూగర్భజలాలు - 37 మండలాల్లో 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా - పది మండలాల్లో 22 అద్దె బోర్లు అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. 37 మండలాల పరిధిలోని 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అధికంగా పుట్లూరు మండలంలో 25 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అలాగే ఆమడగూరు మండలంలో 24, తనకల్లు మండలంలో 21, ఓబుళదేవచెరువులో 18, యల్లనూరులో 18, నల్లమాడలో 17, తలుపులలో 14, ధర్మవరంలో 13, ముదిగుబ్బలో 12 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అసలే నీరులేని గ్రామాలకు మనిషికి 40 లీటర్ల మేరకు సరఫరా చేస్తున్నారు. అలాగే 96 గ్రామాల్లో పశువులకు నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కో పశువుకు 30 లీటర్ల లెక్కన అందిస్తున్నారు. వివిధ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి 22 వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకున్నారు. ఒక్కో బోరుకు నెలకు రూ. 6 వేలు అద్దె చెల్లిస్తున్నారు. జఠిలమవుతున్న సమస్య బోర్లలో నీరు అడుగంటుతుండడంతో తాగునీటి సమస్య రోజురోజుకు జఠిలమవుతోంది. గతేడాదికంటే ఈసారి సమస్య మరీ తీవ్రతరం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 200 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటే ఈసారి 266 గ్రామాలకు చేస్తున్నారు. అలాగే గతేడాది ఈ సమయానికి కేవలం 7 మాత్రమే వ్యవయబోర్లు అద్దెకు తీసుకుని ఉంటే, ఈసారి 22కు పెరిగింది. రానున్న వారం పదిరోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు గ్రామీణ నీటి పథకం అధికారులు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న రూ. 21.78 కోట్లు ఖర్చు చేశారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సమస్య ఎక్కువవుతోంది - కాంతానాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతూ తాగునీటి సమస్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఇప్పటిదాకా రూ. 21.78 కోట్లు ఖర్చు చేశాం. డిసెంబరు దాకా రూ. 12.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. -
బిల్లు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం
- కలెక్టరేట్ పైనుంచి దూకడానికి సిద్ధపడిన బాధిత కుటుంబం అనంతపురం అర్బన్ : నీటిని ట్యాంకర్ల ద్వారా రవాణా చేస్తున్నా బిల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడింది. కలెక్టర్ కార్యాలయంపై నుంచి దుకేందుకు సిద్ధపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కిందకు తీసుకొచ్చారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు శివయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘మాది అమడగూరు మండలం జేకేపల్లి పంచాయతి. సర్పంచ్, ఎంపీడీఓ, కార్యదర్శి ఆదేశం మేరకు గత ఏడాది ఆగస్టు 27 నుంచి పంచాయతీ పరిధిలోని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ట్రిప్పునకు రూ.370 చొప్పున రోజుకు ఏడు ట్రిప్పులు తోలుతున్నాం. రోజుకు రూ.2,590 అవుతుంది. ఈ పన్నెండు నెలలతో పాటు అంతకు ముందు ఒక నెల కలుపుకుని రూ.10 లక్షలకు పైగా రావాలి. ఈ మధ్యకాలంలోనే మా అన్న అప్పన్న విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. ఆయన ఇద్దరు ఆడపిల్లలను, నాకున్న ముగ్గురు కుమార్తెలను పోషించాల్సిన భారం నాపై పడింది. నాకు రావాల్సిన బిల్లును కార్యదర్శి వేరొకరి పేరున రాశారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు. మేము నీటిని రవాణా చేసినట్లు డీఈఈ, ఆర్డీఓ పరిశీలించి వాస్తవమేనని తేల్చారు. అయినా బిల్లు రాకుండా అడ్డుపడుతున్నారు. ఇక్కడి వస్తే ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నేను, మా అమ్మ చెన్నమ్మ, నా భార్య అరుణ, పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడ్డామ’ని తెలిపారు. న్యాయం చేస్తాం : విషయం తెలుసుకున్న డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్ అక్కడి చేరుకుని బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తానని చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని కూడా అక్కడికి పిలిపించి మాట్లాడారు. గ్రామంలోకి వెళ్లి నీటి రవాణాపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. నీరు రవాణా చేసింది నిజమే అయితే తక్షణం బిల్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
ఇంటినీరు! ఇంటిపంట!!
అసలే ఎండాకాలం.. ఇంట్లో పనులకే నీళ్లు కరువొచ్చింది. 30-40 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు తొందరగానే అడుగంటాయి. నీటి ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇక ఇంటిపంటలకు నీళ్లెక్కడి నుంచి వస్తాయి? ‘ఇంటిపంట’ బృంద సభ్యుల మధ్య ఫేస్బుక్లో ఇటీవల ఇదే చర్చ నడుస్తోంది. ఇంతలో సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి పెద్ద వాన కురిసింది. అరగంటకు పైగా నిలబడి కురిసింది. టైల మీద కుండీలు, మడుల్లో పెరుగుతున్న ఇంటిపంటలు వర్షంలో తడిసి హర్షం వెలిబుచ్చుతూ తళతళలాడుతూ తలలూపాయి. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ఇంటిపంటల సాగుదారులు ‘అమ్మయ్య.. ఇంకో రెండు రోజులు నీటి బాధ లేదు’ అనుకొని సంతోషించారు. అయితే, హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన వనమామళె నళిని మాత్రం ఇంక వారం రోజుల వరకు తన ఇంటిపంటలకు నీటి ఇబ్బందే లేదని ప్రకటించారు! తమ మేడ మీద 300 కుండీల్లో వివిధ రకాల పూలు, పండ్లు, కాయగూర మొక్కలను ఆమె అపురూపంగా పెంచుతున్నారు. తమ కుటుంబానికి సరిపడా పండ్లతోపాటు వారంలో మూడు రోజులకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకుంటున్నారు.. ఇంతకీ, ఆమె ఇంటిపంటలకు వారం వరకూ నీరెక్కడ నుంచి వస్తాయనే కదా.. మీ సందేహం..? అక్కడికే వస్తున్నా.. ఈ సమస్యకున్న సరైన పరిష్కారాన్ని ఆమె ముందుగానే గ్రహించి, తగిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమె చేసిందల్లా.. వర్షపు నీటిని.. కురుస్తుండగానే ఒడిసిపట్టుకున్నారు. సిమెంటు రేకుల వసారా మీద నుంచి జారే వర్షపు నీటిని బక్కెట్లు, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నింపుకున్నారు. చూరు నీటిని పట్టుకోవడానికి అంతకుముందే ఏర్పాట్లు చేసుకొని ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. నళిని ఒక్కరే కాదు.. ఇలా ముందుచూపుతో కదిలిన వారంతా వాన నీటిని ఒడిసిపట్టుకోగలిగే ఉంటారు. ఈ సీజన్లో ఇదే మొదటి వాన కావటంతో... చూరు నీటిలో మట్టి, పూలు, ఎండాకులు కలిశాయంతే..! వాన ఎలిసిందో లేదో.. అంతులేని ఈ వర్షానందాన్ని ఇంటిపంట గ్రూప్‌లో నళిని సచిత్రంగా పోస్టు చేసేశారు. నీటి కొరత సమస్యకు వర్షపు నీటి సంరక్షణే అసలు సిసలు పరిష్కారమని సూచించారు! సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందని గుర్తుచేశారు. ఒక మంచి పనిని ముందు తాను చేసి.. తర్వాతే ఇతరులకు సూచించాలన్న గాంధీజీ బాటను నళిని అనుసరించి చూపడం బాగుంది.. అంతలోనే ఓ సందేహం..!! అయినా.. మొక్కలకు పోయడానికి ఏ నీరు మంచిది? వర్షం నీరు మంచిదేనా? ఇంటిపంట గ్రూప్‌లో చర్చ మొదలైంది. మున్సిపాలిటీ వాళ్లు అవీ ఇవీ కలిపి సరఫరా చేసే నీటికన్నా, భూగర్భ జలం కన్నా వర్షం నీరు స్వచ్ఛమైనది కాబట్టి.. భేషుగ్గా పనికొస్తాయని సీనియర్లు తేల్చి చెప్పేశారు. ఆస్బెస్టాస్ నీళ్లు ఇంటిపంటలకు మంచిదేనా? ఇంతలో.. సీనియర్ కిచెన్ గార్డెనర్ పూనం భిదే గారికి గట్టి సందేహమే వచ్చింది (పూనం భిదే తమ టై మీది నుంచి వర్షం నీటిని ఇంకుడు గుంట ద్వారా భూమిలోకి ఇంకేలా ఏర్పాటు చేశారు. బోరు నీటినే ఇంటి అవసరాలకు, ఇంటిపంటలకు వినియోగిస్తున్నారు). ఆస్బెస్టాస్ డస్ట్‌ను పీల్చితే ఆరోగ్యానికి హానికరమని తెలుసు. అయితే ఈ రేకుల మీద నుంచి జారిన నీటిలో ఆస్బెస్టాస్ డస్ట్ కలిసి ఉంటుంది కదా.. ఆ నీటిని ఇంటిపంట మొక్కలకు పోయడం మంచిదేనా? అన్నదే ఆమె సందేహం. అదృష్టంకొద్దీ తాను టిన్ షీట్లను వాడాను కాబట్టి.. సమస్య లేదన్నారు నళిని. ఏ మలినమూ అంటకుండా.. వర్షపు నీటిని స్వచ్ఛంగా ఒడిసిపట్టుకునే మార్గాలు అనేకం వాడుకలో ఉన్నాయి. అందులో ఒకటి: శుభ్రమైన వస్త్రాన్ని ఆరుబయట నాలుగు వైపులా లాగి కట్టి.. మధ్యలో ఏదైనా చిన్న బరువు వేసి.. దాని అడుగున బక్కెట్ లేదా డ్రమ్ము పెడితే చాలు.. స్వచ్ఛమైన ఈ నీరు ఇంటిపంటలకే కాదు.. మనం తాగడమూ మంచిదే! - ఇంటిపంట డెస్క్ -
పొలానికి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు
వేములవాడ(కరీంనగర్): ఎక్కడైనా రైతులు పొలానికి నీళ్లు ఎలా పెడతారు ? బోరు సహాయంతోనో లేక బావిలోని నీటినో ఉపయోగిస్తారు. అయితే, ప్రస్తుత కరెంట్ కోతలతో విసుగు చెందిన ఒక రైతు ఏకంగా వాటర్ ట్యాంకర్‌తో పొలానికి నీటిని అందిస్తున్నాడు. ఈ సంఘటనను చూస్తేనే తెలుస్తుంది తెలంగాణలో కరెంట్ కష్టాలు ఎలా ఉన్నాయో. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం క్షేత్రాజపల్లి గ్రామంలో శుక్రవారం దర్శనమిచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన తాహెర్పాషా వేసవిలో పొలం సాగుచేశాడు. అయితే, కరెంట్ కష్టాలతో పొలానికి నీరు సరిగా అందడంలేదు. ఈ స్థితిలో పాలుపోని రైతు ఎలాగైనా పొలానికి నీటిని అందించాలనుకున్నాడు. దీంతో ఒక వాటర్ ట్యాంకర్ సహాయంతో తన పొలానికి నీటిని అందిస్తున్నాడు. కరెంట్ కష్టాల నుంచి ఉపసమనం కోసం పొలానికి ట్యాంకర్‌తో నీటిని అందిస్తున్నానని వాపోయాడు. -
తిరుపతి దాహార్తి తీరుస్తా
ఆత్మీయ సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: ‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తిరుపతిలో నీటి సమస్యే లేకుండా చేస్తా’నని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్లుగా సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నగర ప్రజల దాహార్తిని తీర్చుతున్న దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డికి శనివారం పెద్దకాపులేఔట్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి సేవలను కొనియాడారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుపతితో సహా రాష్ట్రంలోని లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. రుయా ఆస్పత్రిలో రూ.20ల ఫీజు విధించిన ఘనత చంద్రబాబుదని నిప్పులు చెరిగారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. 11 సార్లు కరెంట్ చార్జీలు, 7 సార్లు బస్సు చార్జీలు పెంచారని గుర్తుచేశారు. అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాతో కలిసి రాష్ట్రాన్ని విడగొట్టిన బాబుకు ఓట్లు అడిగే హక్కులేదన్నారు. మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి మరణంతో రాష్ట్రంలో 672 మంది ప్రాణాలొదిలారంటే జనంలో ఆయన స్థానం ఏ పాటిదో అర్థమవుతుందన్నారు. రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమన్నారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డిని పలువురు శాలువలు, పూలమాలలతో సత్కరించారు. వైఎస్సార్సీపీ నేతలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్‌రెడ్డి, ఎస్కే.బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, భూమన్, జ్యోతిప్రకాష్, కుసుమ పాల్గొన్నారు. -
ట్యాంకర్ల విషయంలోనూ అదే తీరు
ట్యాంకర్ల విషయంలోనూ అదే తీరు వాణిజ్య, గృహావసరాల నీటి ట్యాంకర్లు 551 నిరుపేదల బస్తీలకు నీరందించే ట్యాంకర్లు 127 సంపన్న ప్రాంతాల్లో నీరందించే కమర్షియల్ ట్యాంకర్లు 150 నారాయణగూడ డివిజన్లో ఉచిత నీటి సరఫరా ట్యాంకర్లు 2 మారేడ్‌పల్లి, సరూర్‌నగర్ ప్రాంతాల్లో... 1 సాక్షి, సిటీబ్యూరో: పేదలకు ఉచితంగా నీళ్లిచ్చే విషయంలో చేతులెత్తేసిన జలమండలి.. కనీసం అందుబాటులో ఉన్న నీటిని సైతం సమానంగా పంపిణీ చేసే విషయంలోనూ చతికిలపడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత మంచినీరు సరఫరా చేస్తూ అక్కడి జలబోర్డు ప్రజల మన్ననలు పొందుతుండగా.. నగరంలో నీటి సరఫరా విషయంలో పెద్దలపై ప్రేమ.. పేదలపై వివక్ష చూపుతూ జలమండలి విమర్శల పాలవుతోంది. అందరి నుంచీ ఒకేవిధంగా నీటిచార్జీలు వసూలు చేస్తున్నా... అల్పాదాయ, మధ్యాదాయ, పేద వర్గాలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు అరకొరగా మంచినీటిని సరఫరా చేస్తూ.. సంపన్నులు నివాసముండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకు అత్యధికంగా నీటిని సరఫరా చేస్తోంది. ఉదాహరణకు సంపన్నులు నివాసముండే గచ్చిబౌలి ప్రాంతంలో ప్రతి కుళాయికి నెలకు సగటున 71 కిలోలీటర్ల (71 వేల లీటర్లు) నీటిని సరఫరా చేస్తుండగా.. అదే అల్పాదాయ వర్గాలు అత్యధికంగా ఉండే సైదాబాద్ ప్రాంతంలో ప్రతి కుళాయికి కేవలం 13 కిలోలీటర్లు (13 వేల లీటర్లు) మాత్రమే సరఫరా చేస్తుంది. దీనిని బట్టి జలమండలి వివక్ష ఏ మేరకు ఉందో సుస్పష్టమౌతోంది. సంపన్నులపైనే ప్రేమ జలమండలి వివక్షాపూరిత విధానానికి ఎన్నో రుజువులున్నాయి. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఎస్.ఆర్.నగర్ (డివిజన్-6) పరిధిలో 77,202 కుళాయిలున్నాయి. వీటికి నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు నివసించే గోషామహల్, మంగల్హాట్, జియాగూడ, ఆళ్లబండ, గౌలిగూడ, రెడ్‌హిల్స్, కార్వాన్, హుమాయూన్‌నగర్, షేక్‌పేట్, గోల్కొండ ప్రాంతాల్లో సుమారు లక్ష కుళాయిలున్నాయి. వీటికి రోజువారీ సరఫరా 30 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. 77 వేల పైచిలుకు కుళాయిలకు 40 మిలియన్ గ్యాలన్ల నీటిని నిత్యం సరఫరా చేస్తున్న జలమండలి.. లక్ష కుళాయిలకు 30 మిలియన గ్యాలన్లే సరఫరా చేస్తుంది.