
మామిడిపల్లిలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు
కోనరావుపేట(వేములవాడ): తమ కాలనీల్లో తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మామిడిపల్లిలో మహిళలు ఖాళీబిందెలతో ఆదివారం రోడ్డెక్కారు. మామిడిపల్లిలోని 2, 3, 4 వార్డుల్లో కొన్నిరోజులుగా తాగునీటికి తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన చెందారు. సుమారు రెండు నెలలుగా నీరు దొరకక అవస్థలు పడుతుమన్నారు. నీటి సమస్యలు అధికం కావడంతో రోడ్డెక్కామని వివరించారు. వేములవాడ–సిరికొండ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు.
తమ కాలనీల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మామిడిపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు దత్తత తీసుకుని, అభివృద్ధి పనులు చేయడం మర్చిపోయారని ఆరోపించారు. గ్రామంలో నీటి సమస్యలు ఎక్కువ అవుతున్నా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ పన్నాల విజయ.. సంఘటనా స్థలతానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడారు. నీటి సమస్యలు ఎక్కువగా ఉన్న వార్డుల్లో ఇంటికో డ్రమ్ము నీరు రోజూ అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ∙ రోడ్డెక్కి మహిళల నిరసన
Comments
Please login to add a commentAdd a comment