బేరసారాలు చేయాల్సిన అవసరం లేదు
గెలుస్తామనే ధీమాతోనే తాము ఐదో అభ్యర్థిని బరిలోకి దించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారం రోజుల్లో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఇతర పార్టీలు తమకు ఓటు వేసే అవకాశం ఉందని, బేరసారాలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, యాదవ్రెడ్డి, నేతి విద్యాసాగర్, బి.వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు.