విద్యుత్ సంక్షోభాన్ని అధిగమిస్తాం: ఈటెల
కరీంనగర్: 2017 లోపు తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమిస్తామని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రామగుండంలోని ఎన్ టీపీసీని విస్తరించి 10 వేల నుంచి 17 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఆయన అన్నారు.
ప్రపంచంలోనే సింగరేణిని నంబర్ వన్ ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చి దిద్దుతామని ఈటెల తెలిపారు. సమగ్ర సర్వే వల్ల ఎవరికీ నష్టం లేకుండా చూస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.