హైకోర్టు తీర్పు సరైనది.. కేసీఆర్ది ఏకపక్షం | we welcomes the verdict of hicourt on ghmc election: | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పు సరైనది.. కేసీఆర్ది ఏకపక్షం

Published Mon, Apr 27 2015 1:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

హైకోర్టు తీర్పు సరైనది.. కేసీఆర్ది ఏకపక్షం - Sakshi

హైకోర్టు తీర్పు సరైనది.. కేసీఆర్ది ఏకపక్షం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలపై హైకోర్టు సోమవారం తుదితీర్పును వెలువరించింది. డిసెంబర్ 15లోపు ఎన్నికలు జరిపించాలని న్యాయస్థానం ...ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 31లోగా వార్డుల విభజన పూర్తి చేయాలని సూచించింది.

ఇది వరకే ఈ ఎన్నికలను పదేపదే జాప్యం చేయడంపై హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. తాజా తీర్పు నేపథ్యంలో స్పందించిన లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీది నియంతృత్వ ఏకపక్ష ధోరణి అని విమర్శించారు. కళాభారతి కావాలంటే డీబీఆర్ పార్క్లో కట్టుకోవచ్చని, డీబీఆర్ స్థలాన్ని కళాభారతికి వాడుకోవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియాన్ని క్రీడా స్థలంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నిర్ణయాలన్నీ కూడా గందరగోళంగానే ఉన్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement