అంతం కాదిది.. ఆరంభం | we will always fight for formers: ponguleti | Sakshi
Sakshi News home page

అంతం కాదిది.. ఆరంభం

Published Sun, May 10 2015 12:45 PM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

అంతం కాదిది.. ఆరంభం - Sakshi

అంతం కాదిది.. ఆరంభం

కామారెడ్డి: రైతుల పక్షాన తాము మొదలు పెట్టిన ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఆయన నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో ఒక రోజు రైతు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేందుకే తాము ఈ దీక్ష చేపట్టామని చెప్పారు.

గిట్టుబాటు ధరలు కల్పించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై మాట్లాడటానికి తాను మూడుసార్లు సీఎంను కలిసేందుకు వెళ్లానని, కానీ, ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యేవరకు తాము రైతుల పక్షాన పోరాడతామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement