మృతి చెందిన పెద్దపులి వినయ్ (ఫైల్)
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం వినయ్ (21) అనే పెద్దపులి అనారోగ్యంతో మృతి చెందింది. గత ఏడాదిగా తీవ్ర అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతున్న పెద్దపులి మంగళవారం ఉదయం మృతి చెందింది. గత కొంతకాలంగా సమ్మర్ హౌజ్‌లోని ఇన్‌టెన్సివ్ కేర్‌లో పశు వైద్య నిపుణులు డాక్టర్ ఎం.నవీన్ కుమార్ బృందం దానికి చికిత్స అందజేస్తోంది. డాక్టర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ డాక్టర్ సదానంద్ తదితరులు పోస్టుమార్టం నిర్వహించారు. నమునాలను సేకరించి శాంతినగర్‌లోని వీబీఆర్‌ఐకు పంపినట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment