- ఆర్టీసీకి ఘాటుగా లేఖ రాసిన రవాణా కమిషనర్
హైదరాబాద్: తెలంగాణలో హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) వ్యవహారం గందరగోళంగా మారింది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే నంబర్ ప్లేట్ల చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ సకాలంలో వాటిని వాహనదారులకు అందించకుండా వేధిస్తోంది. కొద్దిరోజులుగా దీనిపై రవాణా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ మాత్రం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై స్పందించిన రవాణాశాఖ కొత్త కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా సకాలంలో ప్లేట్లను అందించకుంటే కాంట్రాక్టు సంస్థకు పెనాల్టీ విధించే అవకాశాన్ని ఉటంకిస్తూ ఆర్టీసీకి ఘాటుగా లేఖ రాశారు. దీంతో కంగుతిన్న ఆర్టీసీ అధికారులు కాంట్రాక్టు సంస్థకు నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.