సాక్షి నెట్‌వర్క్: అన్నా చెల్లెలు, భార్యాభర్తలు, మామా అల్లుళ్లు, మామ కోడళ్లు, తల్లీ కొడుకులు.. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డుల్లో ఫ్యామిలీ ప్యాకేజీ భలే సక్సెస్ అయింది. నల్లగొండ (నీలగిరి) మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, చైతన్య దంపతులు విజయం సాధించారు. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే.. ఈ మున్సిపాలిటీ ఏర్పడిన 67 ఏళ్లలో తొలిసారి భార్యభర్తలు గెలిచారు. ఇలా పలు మున్సిపాలిటీల్లో భార్యాభర్తలు గెలుపొందడం విశేషం.
సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున తల్లీకొడుకులు విజయమ్మ, విశ్వనాథం నెగ్గితే.. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫునే పోటీ చేసిన చంద్రారెడ్డి, ఆయన కోడలు నిహారిక విజయం సాధించారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన కొండ శ్రీలత, కొండ పావని, మహేశ్ గెలిచారు. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తల్లి ముత్తమ్మ గెలుపొందారు.
బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, చైతన్య దంపతులు
Comments
Please login to add a commentAdd a comment