నేరేడ్‌మెట్: వడ్డీ వ్యాపారి వేధింపులతో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నేరేడ్‌మెట్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారం చేసుకునే కుమారి(45) ఏడాది క్రితం యాదగిరి అనే వ్యక్తి నుంచి రూ.22 వేలు అప్పుగా తీసుకుంది. ఇది చెల్లించాలంటూ అతడు కుమారిని కొన్ని రోజులుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో ఈ నెల 11న కుమారి వంటిపై కిరోసిన్ పోసుకుని యాదగిరి ఇంటికి వెళ్లి అక్కడ నిప్పంటించుకుంది.
అప్పటి నుంచి ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. అయితే, బాధితురాలి కుమారుల కథనం మరోలా ఉంది. యాదగిరి కుమారుడు తమ తల్లికి నిప్పంటించాడని వారు ఆరోపిస్తున్నారు.