స్వైన్‌ప్లూతో యువతి మృతి | woman died of swineflu in adilabad | Sakshi
Sakshi News home page

స్వైన్‌ప్లూతో యువతి మృతి

Published Thu, Jan 22 2015 6:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

woman died of swineflu in adilabad

బైంసా(ఆదిలాబాద్): రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న స్వైన్‌ప్లూ రక్కసి ఆదిలాబాద్ జిల్లా ముథోలు మండలం, బాసర గ్రామానికి చెందిన ఒక యువతి (19) ని బలితీసుకుంది.  గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం 12 గంటలకు మృతి చెందినట్టు సమాచారం. అస్వస్థతతో ఉన్న ఆమె ఈనెల 17 న నిజామాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది.

 

అయితే, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వైద్యుల సలహామేరకు సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో ఈనెల 20 న చేరింది. పరిస్థితి విషమించడంతో యశోదా ఆస్పత్రి వర్గాలు ఆమెను గురువారం తెల్లవారుజామున 3 గంటలకు గాంధీ ఆస్పత్రిలో చేరాలని సలహా ఇచ్చారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆమె బంధువులు తెలిపారు. ఈ యువతికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement