మహిళా రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రంఖం గ్రామానికి చెందిన మహిళా రైతు రవీన (22) గురువారం వేకువజామున ఆత్మహత్యకు పాల్పడింది. అనకా చంద్రకాంత్, రవీన దంపతులు గ్రామ శివారులో తొమ్మిదెకరాల్లో పత్తి, కంది పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సరిగా పండలేదు. ఆశించిన మేర దిగుబడి రాలేదు.
బ్యాంకు అప్పు రూ.లక్ష, ప్రైవేటు అప్పులు రూ.లక్షకు పైగా ఉన్నాయి. వాటిని ఎలా తీర్చేదని తీవ్ర మనస్తాపం చెందిన రవీన ఇంట్లో పురుగుల మందు తాగింది. ఆ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై బొల్లి నానా వెల్లడించారు.