
గణపురం: ‘భర్తతో గొడవైంది.. జీవితం మీద విరక్తి చెందా.. నా రెండేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నా’అని ఓ మహిళ 100 నంబరుకు ఫోన్ చేసింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆమెను రక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన కొడగాని మౌనిక.. బుధవారం 100 నంబర్‌కు డయల్ చేసింది. దీంతో కంట్రోల్ రూం నుంచి గణపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. ఎస్సై రాజన్‌బాబు సిబ్బందితో హుటాహుటిన వారి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉన్న తల్లీ కొడుకులను స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మౌనిక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని హైదరాబాద్‌లోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచి్చనట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment