రమావత్ బాలా మృతదేహం
తిరుమలగి(నాగార్జునసాగర్) : తను ప్రాణంగా పెంచుకున్న ఆవు చనిపోయిందన్న బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని సుంకిశాలతండాలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన రమావత్ గ్యామ సుక్కి దంపతులకు ముగ్గురు సంతానం, రెండవ కుమారుడు రమావత్ బాలా(19)కి చిన్ననాటి నుంచి పశువులు అంటే ఇష్టం. రోజు మాదిరిగానే డిసెంబర్ 29వ తేదీన పశువుల వద్దకు వెళ్లాడు. తాను సాకుతున్న ఆవు వెరే వ్యక్తి చేనులోకి వెళ్లింది.
ఆవును తోలుకువచ్చే క్రమంలో ఆవును బలంగా కొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. క్షణికావేశంలో ఆవును తాను కొట్టడంతోనే మృతి చెందిందనే బాధతో బాలా నాయకునితండా వద్ద గల టెయిల్‌పాండ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెయిల్‌పాండ్‌లో మత్స్యకారులు చేపలు పడుతుండగా బాలా మృతదేహాన్ని గమనించి బయటికి తీశారు. అదే గ్రామంలో మృతుడికి బంధువులు ఉండడంతో గుర్తించి తల్లిదండ్రులకు సమాచా రం అందించారు. బాలా మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment