నంగునూరు: కుటుంబ కలహాలతో వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు ఐదేళ్ల క్రితం సంతోషి (25) అనే మహిళతో వివాహమైంది. వారికి ఒక పాప(3) ఉంది. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
కొన్ని రోజుల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిన సంతోషి శనివారం రాత్రి భర్త దగ్గరకు వచ్చింది. మళ్లీ ఇరువురి మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
Published Sun, Aug 16 2015 2:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement