ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో బాలింత మృతి, ఆందోళన | women died in mancherial government hospital | Sakshi
Sakshi News home page

ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో బాలింత మృతి, ఆందోళన

Published Tue, Jun 20 2017 2:16 PM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

మంచిర్యాల ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో మంగళవారం ఉదయం సమీన(22) అనే బాలింత మృతి చెందింది.

మంచిర్యాల: మంచిర్యాల ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో మంగళవారం ఉదయం సమీన(22) అనే బాలింత మృతి చెందింది. ఆసిఫాబాద్‌ ప్రభుత‍్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి సమీన మగబిడ‍్డను ప్రసవించింది. ప్రసవించిన తర్వాత సమీన ఆరోగ‍్యం విషమంగా ఉండటంతో అక‍్కడి వైద్యులు మంచిర్యాల ఏరియా ఆస‍్పత్రికి రెఫర్‌ చేశారు.
 
మంగళవారం ఉదయం మంచిర్యాల ఆస‍్పత్రిలో చేరిన ఆమె శ‍్వాస తీసుకోవడం కష‍్టం కావడంతో ఆక్సిజన్‌ పెట్టారు. అక‍్కడి సిబ‍్బంది కాసేపటికి ఆక్సిజన్‌ తోలగించడంతో సమీన ఊపిరి ఆడక మృతి చెందింది. దాంతో మృతురాలి కుటుంబసభ‍్యులు ఆస‍్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement