వివాహేతర సంబంధముందని.. | womens attack women due to dought on unmaritual relationship | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధముందని..

Published Thu, Mar 19 2015 12:07 AM | Last Updated on Thu, May 24 2018 12:31 PM

womens attack women due to dought on unmaritual relationship

- మహిళపై దాడి ఆపై శరీరంపై జీడి పోసిన వైనం
హైదరాబాద్ (అత్తాపూర్): వివాహేతర సంబంధముందని ఓ మహిళను మరో నలుగురు మహిళలు దాడి చేసి గాయపరిచారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని కిస్మత్‌పూర్ గ్రామానికి చెందిన లావణ్య(27) రాంకుమార్ భార్యాభర్తలు. లావణ్య రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన సుధాకర్‌కు రూ. ఐదు వేలు అప్పుగా ఇచ్చింది. అప్పు చెల్లించాలని పది రోజులుగా లావణ్య సుధాకర్‌కు ఫోన్ చేస్తుంది. ఈ నెల 10వ తేదీన లావణ్య, సుధాకర్ ఫోన్లో మాట్లాడుతుండగా సుధాకర్ భార్య మయూరి విన్నది.

తన భర్తతో లావణ్య వివాహేతర సంబంధం నెరపుతోందని అనుమానం పెంచుకుంది. ఈనెల 16వ తేదీనా లావణ్య తన కుమారుడిని స్కూల్‌లో వదిలి వస్తుండగా మార్గమధ్యలో మయూరి మరో ముగ్గురు మహిళలతో కలిసి ఓ నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్లింది. అక్కడ లావణ్యను తీవ్రంగా కొట్టి ఆమె శరీరంపై జీడి పోశారు. బుధవారం బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement