unmaritual relationship
-
మహిళతో వివాహేతర సంబంధం; ఆమె కూతురిని పెళ్లి చేసుకోవాలని..
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు నెలల కిందట నమోదైన అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. సారిక గ్రామానికి చెందిన బొద్దూరు పవన్‌కుమార్ (17) అదృశ్యం కేసులో సంచలన విషయాలు తేలాయి. అతడు హత్యకు గురయ్యాడని తేలింది. ఈ హత్యలో పాల్గొన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ డీఎస్పీ అనిల్‌కుమార్ తెలిపారు. తన కుమారుడు పవన్‌కుమార్ మే 8వ తేదీన సాయంత్రం పాలప్యాకెట్లు తెచ్చేందుకు ఇంటి నుంచి బైక్‌పై వెళ్లి తిరిగి రాలేదని మే 9న తల్లి లత పోలీసులకు ఫిర్యాదుచేసింది. అదృశ్యం కేసుగా నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జూలై 27వ తేదీన సారిక గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో ఓ మృతదేహాన్ని గుర్తించగా అది పవన్దిగా నిర్ధారించి దర్యాప్తు చేయగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా స్కెచ్‌తో... పవన్‌కుమార్ తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలో తల్లి లతకు పద్మనాభ మండలం చిన్నాపురానికి చెందిన గిడిజాల జగదీశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పవన్ పలుమార్లు తల్లిని మందలించాడు. జగదీశ్‌ను సైతం హెచ్చరించినా వినకుండా వారి బంధం కొనసాగుతోంది. ఇదిలాఉండగా.. సారిక గ్రామానికి చెందిన వాలిపల్లి సురేశ్ (33)తో పవన్‌కు మంచి స్నేహం ఉంది. సురేశ్ కన్ను పవన్ చెల్లిపై పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. దీనికి పవన్‌తో పాటు తల్లి నిరాకరించారు. పాఠశాలకు వెళ్తున్న చిన్నపిల్ల కావాల్సి వచ్చిందా అంటూ మందలించారు. ఆ అమ్మాయి మీద ప్రేమతో సురేశ్ లతతో వివాహేతర సంబంధం ఉన్న జగదీశ్‌ను సంప్రదించాడు. ఇద్దరూ ఏకమై పవన్‌ను చంపితే తమ లక్ష్యాలు నెరవేరుతాయని భావించారు. పవన్ హత్యకు తనవద్ద పనిచేస్తున్న సువ్వాడ శంకరరావును సురేశ్ సాయం కోరాడు. ట్రాక్టర్ డ్రైవర్ పిట్టా శంకర్, మరో స్నేహితుడు మేకల సోముల సాయంతో హత్యకు పథకం సిద్ధం చేశాడు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అనిల్‌కుమార్, సీఐ మంగవేణి, ఎస్ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్, కిరణ్ కుమార్‌నాయుడు, ప్రశాంత్ కుమార్ అయితే మే 8వ తేదీన పవన్‌కు డబ్బులు అవసరమై సురేశ్‌ను రూ.2 వేలు అప్పు అడిగాడు. సురేశ్ రూ.వెయ్యి ఇచ్చి మిగతా వెయ్యి సాయంత్రం ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని శంకర్‌కి సురేశ్ చెప్పగా ఇదే అదును అని సారిక గ్రామ సమీపంలో కల్లు తాగే ప్రదేశం వద్ద మేకల సోములు, పిట్టా శంకర్లను తాళ్లు, ప్లాస్టిక్ గోనె సంచెతో పవన్‌ను హతమార్చేందుకు సిద్ధంగా ఉంచారు. సాయంత్రం కావడంతో రూ.వెయ్యి కోసం పవన్ ఫోన్ చేయగా సురేశ్ సువ్వాడ శంకర్‌తో కలిసి ముగ్గురూ ఒకే వాహనంపై కల్లుతాగే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే కాపు కాస్తున్న సువ్వాడ శంకర్ బైక్ దిగుతుండగానే కర్రతో పవన్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని కనిపించకుండా సోములు, పిట్టా శంకర్ గోనె సంచిలో మూట కట్టి సమీపంలోని వ్యవసాయ బావిలో వేశారు. బైక్‌ను కూడా తాళ్లతో బావిలో పడేశారు. అయితే పవన్ ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కొన్ని క్లూలతో హంతకులు వాలిపల్లి సురేశ్, సువ్వాడ శంకరరావు, మేకల సోములు, పిట్టాశంకర్, గిడిజాల జగదీశ్ చిక్కారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన రూరల్ సీఐ మంగవేణి, ఎస్ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్‌నాయుడు, సీసీఎస్ ఎస్ఐ ప్రశాంత్ కుమార్, ఏఎస్ఐ త్రినాథరావు, హెచ్‌సీలు శ్యామ్‌బాబు, రామారావు, సిబ్బంది షేక్ షఫీ, కోటేశ్వరరావు, రమణ, సాయిలను డీఎస్పీ అభినందించారు. వారికి నగదు పోత్సాహక బహుమతులను అందజేశారు. -
భార్యను ప్రేమిస్తున్నాడని.. 25సార్లు కత్తితో పొడిచి!
న్యూఢిల్లీ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని 25 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఈ దారుణ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురాలో చోటుచేసుకోగా, తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉత్తర్ ప్రదేశ్ అలీఘడ్ కు చెందిన వినోద్ కుమార్(38) అనే వ్యక్తి స్థానిక భజన్ పురాలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 23 ఏళ్ల షాను అనే వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వినోద్ అనుమానించాడు. షాను తరచుగా తన ఇంటి చుట్టుపక్కల ఉండటాన్ని గమనించాడు. శుక్రవారం కూడా అదే విధంగా తన ఇంటి ముందు తచ్చాడుతుండగా షానును ఇంట్లోకి పిలిచాడు. షాను మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న వినోద్.. ఒక్కసారిగా షాను మీద కత్తితో దాడికి దిగాడు. వినోద్ ఇంట్లో ఉన్న ఓ మైనర్ బాలుడు షానును వెనుకనుంచి గట్టిగా పట్టుకోగా.. నా భార్యను ప్రేమిస్తూ, ఆమెతో సంబంధం పెట్టుకుంటావా అని అరుస్తూ షానును కత్తితో 25 సార్లు పొడిచాడు. రక్తపుమడుగులో పడి ఉన్న షానును ఓ దుప్పటిలో చుట్టి ఇంటికి తాళం వేసి ఇద్దరు పరారయ్యారు. అదే రోజు రాత్రి అపార్ట్ మెంట్ వాసులు పోలీసులుకు ఫోన్ చేసి వినోద్ వ్యవహరం చెప్పారు. ఉదయం వేళ ఆ ఇంటినుంచి అరుపులు వినిపించాయిని, అప్పటినుంచి వినోద్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రి 10 గంటల సమయంలో వినోద్ ఇంటికి వచ్చిన పోలీసులు తాళాలు పగులకొట్టి లోనికి వెళ్లి పరిశీలించగా.. షాను చనిపోయి ఉన్నాడని గుర్తించారు. హత్య చేసేందుకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో రక్తపు మరకలు శుభ్రం చేసిన వినోద్ తల్లిని పోలీసులు ప్రశ్నించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు వినోద్ సొంతగ్రామం యూపీలోని అలీఘడ్ కు వెళ్లి వినోద్ కుమార్ తో పాటు హత్య చేయడంలో అతడినికి సహకరించిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడన్న కారణంగానే షానును అంతమొందించినట్లు నిందితుడు వినోద్ విచారణలో వెల్లడించాడు. -
వివాహేతర సంబంధాలు.. వ్యక్తి హత్య!
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద మెకానిక్ పని చేస్తున్న ఓ వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెకానిక్ హత్యకు వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో వెతికి పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
దుస్తులు చింపేసి, జుట్టు కత్తిరించి...!
ప్రొద్దుటూరు : సాటి మహిళ అని చూడకుండా కొందరు అమానుషంగా ప్రవర్తించారు. దుస్తులు చిరిగేలా దాడి చేసి, ఆమె జుట్టును కత్తిరించారు. ఈ సంఘటన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఇంద్రాణి అనే మహిళ సుబ్బిరెడ్డి కొట్టాలలో నివాసం ఉంటోంది. ఆమెకు 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. పావని, గణేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఆమె భర్తతో విడిపోయింది. ఆర్ట్స్ కాలేజి రోడ్డులో నివాసం ఉంటున్న గణేష్‌రెడ్డి అనే వ్యక్తి తనకు పెళ్లి కాలేదని చెప్పి మూడేళ్ల క్రితం ఇంద్రాణితో పరిచయం పెంచుకున్నాడు. ఏడాది కిందట ఈ విషయం అతని భార్య శ్రీదేవికి తెలియడంతో పలుమార్లు గొడవ పడింది. అదే సమయంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనతో మాట్లాడవద్దని, తనకు తరచూ ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెట్టవద్దని ఇంద్రాణి ఆ రోజే గణేష్ రెడ్డికి తెగేసి చెప్పింది. అయినా తన భర్త ఇంద్రాణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని శ్రీదేవి 20 మంది మహిళలను వెంటబెట్టుకుని ఇంద్రాణి ఇంటికి వెళ్లింది. అందరూ కలిసి ఆమె ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఇనుప సుత్తితో ఆమె తలపై కొట్టి గాయపరిచారు. ఆపై ఆమెను కొందరు పట్టుకోగా, మరికొందరు కత్తెరతో జుట్టు కత్తిరించారు. ఆమె వేసుకున్న దుస్తులను చింపేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరుడు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. శ్రీదేవితో పాటు మరి కొందరు మహిళలు తనపై దాడి చేశారని ఇంద్రాణి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బీరువాలో ఉన్న కొంత డబ్బు, 2.5 తులాల బంగారం కనిపించలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ‘మా ఇంటి వద్దకు రావద్దని అతనికి ఏడాది క్రితమే చెప్పాను. అయినా అతను వినిపించుకోవడం లేదు. వీళ్లు నన్ను చంపేస్తే నా పిల్లలు ఏం కావాలి. పిల్లల కోసమే బతుకుతున్నాను. నా బతుకేదో నన్ను బతకనివ్వండి. ఇంత మంది ఇంటి మీదికి వచ్చి రౌడీల్లా దాడి చేసి చంపేయబోయారు’ అంటూ బాధితురాలు ఇంద్రాణి పోలీసుల వద్ద వాపోయింది. -
వివాహేతర సంబంధం నెపంతో వ్యక్తి హత్య!
నల్గొండ(కోదాడ): కోదాడ మండలం అమీనాబాద్ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మర్మాంగాల మీద బలంగా కొట్టడం వల్ల చనిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తన సంబంధాలకు భర్త అడ్డుగా ఉన్నాడని..
దమ్మపేట(ఖమ్మం): తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది.. అడ్డు తొలగించుకునేందుకు అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టింది. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామ శివారు ఆసన్నగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆసన్నగూడెం గ్రామానికి చెందిన గుర్రాల కృష్ణయ్య(38), వెంకటరమణ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా, వెంకటరమణ మందలపల్లికి చెందిన దేవదానం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో కృష్ణయ్య గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. అయినా, వెంకటరమణ తీరుమారలేదు. కొన్ని రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను హతమార్చాలని పథకం పన్నింది. పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణయ్యపై పోసి నిప్పంటింది. కృష్ణయ్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అయితే వారు వచ్చేసరికే కృష్ణయ్య తీవ్రంగా కాలి చనిపోయూడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ కవిత ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య
ఎల్లనూరు (అనంతపురం జిల్లా): భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా ఎల్లనూరులో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ఎల్లనూరుకు చెందిన మిడిగంటి రామతులసి(21), అదే గ్రామానికి చెందిన అరవిందు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇటీవల ఒక చిన్నారి పుట్టింది. అయితే అరవిందు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని రామతులసి తల్లిదండ్రుల వద్ద వాపోయేది. ఎన్నిసార్లు నచ్చజెప్పినా భర్త వినకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మరణానికి తన అల్లుడు అరవిందు కారణమని రామతులసి తండ్రి రంగడు ఎల్లనూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రామతులసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
వివాహేతర సంబంధముందని..
- మహిళపై దాడి ఆపై శరీరంపై జీడి పోసిన వైనం హైదరాబాద్ (అత్తాపూర్): వివాహేతర సంబంధముందని ఓ మహిళను మరో నలుగురు మహిళలు దాడి చేసి గాయపరిచారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని కిస్మత్పూర్ గ్రామానికి చెందిన లావణ్య(27) రాంకుమార్ భార్యాభర్తలు. లావణ్య రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన సుధాకర్‌కు రూ. ఐదు వేలు అప్పుగా ఇచ్చింది. అప్పు చెల్లించాలని పది రోజులుగా లావణ్య సుధాకర్‌కు ఫోన్ చేస్తుంది. ఈ నెల 10వ తేదీన లావణ్య, సుధాకర్ ఫోన్లో మాట్లాడుతుండగా సుధాకర్ భార్య మయూరి విన్నది. తన భర్తతో లావణ్య వివాహేతర సంబంధం నెరపుతోందని అనుమానం పెంచుకుంది. ఈనెల 16వ తేదీనా లావణ్య తన కుమారుడిని స్కూల్లో వదిలి వస్తుండగా మార్గమధ్యలో మయూరి మరో ముగ్గురు మహిళలతో కలిసి ఓ నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్లింది. అక్కడ లావణ్యను తీవ్రంగా కొట్టి ఆమె శరీరంపై జీడి పోశారు. బుధవారం బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.