దమ్మపేట(ఖమ్మం): తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది.. అడ్డు తొలగించుకునేందుకు అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టింది. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామ శివారు ఆసన్నగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆసన్నగూడెం గ్రామానికి చెందిన గుర్రాల కృష్ణయ్య(38), వెంకటరమణ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా, వెంకటరమణ మందలపల్లికి చెందిన దేవదానం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో కృష్ణయ్య గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. అయినా, వెంకటరమణ తీరుమారలేదు.
కొన్ని రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను హతమార్చాలని పథకం పన్నింది. పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణయ్యపై పోసి నిప్పంటింది. కృష్ణయ్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అయితే వారు వచ్చేసరికే కృష్ణయ్య తీవ్రంగా కాలి చనిపోయూడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్‌పీ కవిత ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు.
తన సంబంధాలకు భర్త అడ్డుగా ఉన్నాడని..
Published Fri, Aug 7 2015 7:54 PM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM
Advertisement
Advertisement